Uttam Kumar Reddy: శాసనసభలో నేనే సీనియర్.. కేసీఆర్ నా కంటే సీనియర్ కానీ సభకు రావడం లేదు: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy Claims Seniority in Assembly KCR Absent
  • అసెంబ్లీకి వచ్చే వాళ్లలో మాత్రం తాను సీనియర్ నాయకుడినన్న మంత్రి
  • ఏడుసార్లు ఒకే బీఫామ్‌పై గెలిచానన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి
  • పునర్విభజన జరిగితే ప్రతి పార్లమెంటులో రెండు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయన్న మంత్రి
ప్రస్తుత శాసనసభలో తానే సీనియర్ అని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ తనకంటే సీనియర్ అయినప్పటికీ సభకు రావడం లేదని ఆయన అన్నారు. ప్రస్తుతం అసెంబ్లీకి వచ్చే వారిలో మాత్రం తాను సీనియర్ నాయకుడినని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు.

ఏడుసార్లు ఒకే పార్టీ బీఫామ్‌పై గెలిచిన వ్యక్తిని తానే అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్లు అమలులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి రెండు అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయని ఆయన అన్నారు.
Uttam Kumar Reddy
Telangana Assembly
KCR
Senior Leader
Legislative Assembly
Women's Reservation Bill
Constituency Reshuffle
Telangana Politics

More Telugu News