Harmanpreet Kaur: టీమిండియా మహిళల జట్టుతో 'కౌన్ బనేగా కరోడ్ పతి'

Harmanpreet Kaur and Team India on Kaun Banega Crorepati
  • కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు రానున్న మహిళా క్రికెట్ జట్టు
  • కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఇతర ప్లేయర్లతో ప్రత్యేక ఎపిసోడ్
  • హోస్ట్ అమితాబ్ బచ్చన్‌తో సరదా సంభాషణలు, క్రికెట్ ముచ్చట్లు
  • ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ స్మృతి మంధన
ప్రముఖ క్విజ్ ఆధారిత రియాలిటీ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ (KBC) తదుపరి ఎపిసోడ్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు సందడి చేయనుంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన జట్టు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని హోస్ట్ అమితాబ్ బచ్చన్‌తో ముచ్చటించనున్నారు. క్రికెట్, క్విజ్‌లను ఈ ఎపిసోడ్ ఒకే వేదికపైకి తీసుకురానుంది.

ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో పాటు హర్లీన్ కౌర్ డియోల్, రిచా ఘోష్, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుందార్ పాల్గొన్నారు. ఆటగాళ్లు తమ మైదానంలోని అనుభవాలు, జట్టు సభ్యుల మధ్య ఉండే స్నేహపూర్వక వాతావరణం గురించి అమితాభ్‌తో పంచుకున్నారు. అయితే, జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధన ఈ ఎపిసోడ్‌కు హాజరుకాలేదు.

ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన షఫాలీ వర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, దీప్తి శర్మకు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులు దక్కాయి. ఈ చారిత్రక విజయాన్ని పురస్కరించుకుని భారత మహిళా శక్తిని, క్రీడా స్ఫూర్తిని ఈ ఎపిసోడ్ మరింతగా సెలబ్రేట్ చేయనుంది.

‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ కార్యక్రమం సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్, సోనీ లివ్‌లో ప్రసారం అవుతుంది.
Harmanpreet Kaur
Indian Women's Cricket Team
Kaun Banega Crorepati
KBC
Smriti Mandhana
T20 World Cup
Amitabh Bachchan
Harleen Kaur Deol
Shafali Verma
Deepti Sharma

More Telugu News