I-Bomma Ravi: మరోసారి ఐ-బొమ్మ రవి కస్టడీ కోసం పోలీసుల పిటిషన్

IBomma Ravi Custody Petition Filed by Police Again
  • నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు
  • వారం రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు
  • రేపు కస్టడీపై తీర్పు వెలువరించనున్న నాంపల్లి కోర్టు
పైరసీ వెబ్‌సైట్ ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమంది రవిని మరోసారి కస్టడీకి తీసుకోవడానికి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతనిని అరెస్టు చేసిన అనంతరం పోలీసులు వారం రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా, న్యాయస్థానం ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. దీంతో ఐదు రోజుల పాటు రవిని కస్టడీకి తీసుకుని పోలీసులు విచారించారు. అతని నుంచి కీలక వివరాలు రాబట్టారు.

రవి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు మరోసారి కస్టడీకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో నాంపల్లి కోర్టులో ఏడు రోజుల కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ కస్టడీపై కోర్టు రేపు తీర్పును వెలువరించనుంది.

ఐదు రోజుల పాటు అతడిని విచారించిన పోలీసులు పలు విషయాలను మీడియాకు వెల్లడించారు. ఐ-బొమ్మ రవి అతి విశ్వాసంతో ఉన్నాడని, ఒంటరిగా ఉంటూ, వారానికో దేశం తిరిగేవాడని విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈజీ మనీకి అలవాటు పడ్డాడని, లక్ష డాలర్లు వెచ్చించి కరేబియన్ దీవుల పౌరసత్వం కొనుగోలు చేశాడని వెల్లడించారు.
I-Bomma Ravi
I-Bomma
Ravi
Hyderabad Cyber Crime Police
Piracy website

More Telugu News