Kota Vinuta: రాయుడు హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కోట వినుతే చంపించిందన్న మృతుడి చెల్లెలు!

Rayudus sister alleges Kota Vinuta involvement in murder
  • శ్రీకాళహస్తి రాయుడి హత్య కేసులో ఊహించని మలుపు
  • కోట వినుత వర్గమే తన అన్నను చంపిందన్న మృతుడి సోదరి
  • ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డిపై కావాలనే నిందలు వేస్తున్నారని ఆరోపణ
  • లక్షలు ఖర్చుపెట్టి పెయిడ్ వీడియోలు చేయిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు
  • రాయుడి మొబైల్ ఫోన్‌ను తమకు అప్పగించాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపిన శ్రీకాళహస్తి జనసేన నాయకురాలు కోట వినుత సహాయకుడు రాయుడు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలు వస్తున్న తరుణంలో, మృతుడు రాయుడి సోదరి విడుదల చేసిన ఓ వీడియో ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. తన అన్నను కోట వినుత వర్గీయులే హత్య చేసి, ఆ నేరాన్ని ఉద్దేశపూర్వకంగా ఎమ్మెల్యేపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

తాజాగా విడుదల చేసిన వీడియోలో రాయుడి సోదరి మాట్లాడుతూ.. "మా అన్నతో అన్ని పనులు చేయించుకుని, చివరికి కనికరం లేకుండా కడతేర్చారు. ఇది పక్కా ప్రణాళికతో జరిగిన హత్య. మూడో కంటికి తెలియకుండా నా అన్నను మాయం చేశారు" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చేందుకు కోట వినుత వర్గం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెయిడ్ వీడియోలు చేయిస్తోందని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా, తన అన్న బతికి ఉన్నప్పుడు అతడిని బెదిరించి ఓ వీడియోను కూడా చిత్రీకరించారని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో రాయుడు ఉపయోగించిన మొబైల్ ఫోన్‌ను వెంటనే తమకు అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు.

కాగా, ఈ హత్య కేసు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశం కావడంతో జనసేన పార్టీ ఇప్పటికే కోటి వినుతను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బాధితుడి కుటుంబం నుంచే నేరుగా వినుత వర్గంపై ఆరోపణలు రావడంతో ఈ కేసు మరింత సంక్లిష్టంగా మారింది.
Kota Vinuta
Srikalahasti
Rayudu murder case
Janasena
Bojjala Sudheer Reddy
Andhra Pradesh politics
Kota Vinuta aide
political murder
AP politics
crime news

More Telugu News