Celina Jaitly: భర్తపై గృహ హింస కేసు పెట్టిన బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ

Celina Jaitly Files Domestic Violence Case Against Husband Peter Haag
  • భర్త పీటర్ హాగ్ పై గృహ హింస కేసు పెట్టిన సెలీనా జైట్లీ
  • గృహ హింస, క్రూరత్వం, మానిప్యులేషన్ ఆరోపణలు
  • పీటర్ హాగ్ కు నోటీసులు జారీ చేసిన ముంబై కోర్టు
  • యూఏఈలో సోదరుడి నిర్బంధంపైనా పోరాడుతున్న నటి
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్ పై గృహ హింస కేసు పెట్టారు. తన భర్త నుంచి గృహ హింస, క్రూరత్వం, మానిప్యులేషన్ ఎదుర్కొంటున్నానని ఆరోపిస్తూ ఆమె ముంబై కోర్టును ఆశ్రయించారు. డొమెస్టిక్ వయొలెన్స్ యాక్ట్ కింద కేసు దాఖలు చేయగా, న్యాయస్థానం పీటర్ హాగ్ కు నోటీసులు జారీ చేసింది.

ఆస్ట్రియాకు చెందిన వ్యాపారవేత్త, హోటలియర్ అయిన పీటర్ హాగ్ ను సెలీనా 2011లో వివాహం చేసుకున్నారు. వీరికి 2012లో కవల కుమారులు జన్మించారు. ఆ తర్వాత 2017లో మరోసారి కవలలకు జన్మనివ్వగా, వారిలో ఒకరు గుండె సంబంధిత సమస్యతో మరణించారు.

సెలీనా జైట్లీ ప్రస్తుతం ఒకేసారి రెండు వైపులా న్యాయపోరాటం చేస్తున్నారు. గత నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో తన సోదరుడు, రిటైర్డ్ మేజర్ విక్రాంత్ జైట్లీని అక్రమంగా అపహరించి, నిర్బంధించారంటూ ఆమె ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. 2024 సెప్టెంబర్ నుంచి నిర్బంధంలో ఉన్న తన సోదరుడి యోగక్షేమాల గురించి విదేశాంగ శాఖ సరైన సమాచారం ఇవ్వడంలో విఫలమైందని ఆమె ఆరోపించారు. దీనిపై స్పందించిన కోర్టు, ఆమె సోదరుడితో పాటు అతని భార్యతో మాట్లాడేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది.

‘నో ఎంట్రీ’, ‘అప్నా సప్నా మనీ మనీ’, ‘గోల్‌మాల్ రిటర్న్స్’ వంటి చిత్రాలతో సెలీనా జైట్లీ బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలు.
Celina Jaitly
Peter Haag
domestic violence
Mumbai court
Vikrant Jaitly
UAE
Bollywood actress
Indian actress
Celina Jaitly husband
Celina Jaitly movies

More Telugu News