Thirty Meter Telescope: గ్రహాంతర వాసుల గుట్టు విప్పే భారీ టెలీస్కోప్

Thirty Meter Telescope to Uncover Extraterrestrial Secrets
  • భారత దేశ భాగస్వామ్యంతో జపాన్ నిర్మాణం
  • 30 మీటర్ల ప్రైమరీ మిర్రర్ సహా మొత్తం 500 ల మిర్రర్లతో ఏర్పాటు
  • విశ్వ రహస్యాలపై పరిశోధనలో సరికొత్త ముందడుగు
సువిశాల విశ్వంలో మనకు తెలియని వింతలు,విశేషాలు ఎన్నో ఉన్నాయని, సౌర కుటుంబం ఆవల జీవం ఉనికి ఉండే అవకాశం ఉందని ఖగోళ శాస్త్రవేత్తల అభిప్రాయం. విశ్వంలోని ఈ రహస్యాల గుట్టు విప్పేందుకు నిరంతరం పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటికప్పుడు టెక్నాలజీని జోడిస్తూ శోధన చేస్తూనే ఉన్నారు. గ్రహాంతర వాసుల ఉనికిని గుర్తించేందుకు జరుగుతున్న పరిశోధనల్లో జపాన్ తాజాగా సరికొత్త టెలిస్కోప్ నిర్మాణం తలపెట్టింది. థర్టీ మీటర్ టెలిస్కోప్ (టీఎంటీ) పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భారత దేశానికీ భాగస్వామ్యం ఉంది. ప్రపంచంలోనే అత్యంత భారీ టెలిస్కోప్ ల సరసన చోటు సంపాదించుకునేలా నిర్మించాలని ప్రయత్నిస్తోంది. ఈ టెలిస్కోప్ తో గ్రహాంతరవాసులు ఉన్నారా అనే ప్రశ్నకు సమాధానం కనుగొనేందుకు ఇరు దేశాలు పరిశోధనలు ప్రారంభించాయి.
 
40 ఏళ్ల క్రితం అంతరిక్షంలోకి రేడియో సిగ్నల్స్..
జపాన్‌ ఖగోళ శాస్త్రవేత్తలు 40 సంవత్సరాల క్రితం అంతరిక్షంలోకి రేడియో సిగ్నల్స్ పంపించారు. వాటికి ప్రతిస్పందనను గుర్తించేందుకు తాజాగా ఈ టెలిస్కోప్ తో ప్రయత్నిస్తున్నారు. జపాన్‌లోని హ్యోగో యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్త షిన్యా నరుసావా నేతృత్వంలోని బృందం గ్రహాంతరవాసుల నుంచి వచ్చే ప్రతిస్పందనను వినడానికి సిద్ధమవుతోంది. 1983 ఆగస్టు 15న ప్రొఫెసర్లు మసాకి మోరిమోటో, హిసాషి హిరబయాషిలు స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం యొక్క యాంటెన్నాను ఉపయోగించి భూమి చరిత్ర మరియు మానవ రూపం గురించి 13 చిత్రాలతో కూడిన రేడియో సిగ్నల్స్‌ను అంతరిక్షంలోకి పంపారు. ఆ సందేశం పంపిన నక్షత్ర వ్యవస్థకు సుమారు 40 సంవత్సరాలలో చేరుతుందని వారు అంచనా వేశారు.

థర్టీ మీటర్ టెలిస్కోప్ (TMT) 
ప్రపంచంలోని అత్యంత పెద్ద ఆప్టికల్ మరియు ఇన్‌ఫ్రారెడ్ టెలిస్కోప్‌లలో థర్టీ మీటర్ టెలిస్కోప్ ఒకటి. ఇది విశ్వం యొక్క లోతైన రహస్యాలను ఛేదించడానికి, సుదూర నక్షత్రాలు, గెలాక్సీలు మరియు ఎక్సోప్లానెట్‌లను అధ్యయనం చేయడానికి ఉద్దేశించి నిర్మిస్తున్నారు. దీని ప్రైమరీ మిర్రర్ 30 మీటర్ల వ్యాసం కలిగి ఉంటుంది. ఇది 492 చిన్న, హెక్సాగోనల్ అద్దం భాగాలను కలిపి ఒకే ఉపరితలంగా పనిచేసేలా రూపొందించనున్నారు. ఈ టెలిస్కోప్ నిర్మాణానికి లడఖ్‌ లోని హాన్లే ప్రాంతం పరిశీలనలో ఉంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ లో భారత్, జపాన్ కీలక దేశాలు కాగా అమెరికా, కెనడా, చైనాలు కూడా ఇందులో పాలుపంచుకోనున్నాయి.
Thirty Meter Telescope
TMT Telescope
Extraterrestrial life
Space research
Japan telescope
India telescope
Hanle Ladakh
Radio signals space
Shinya Narusawa
Exoplanets

More Telugu News