Andhra King Thaluka: ఉపేంద్ర చెప్పిన ఆ ఒకే ఒక్క మాటతో ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కథ పుట్టింది: దర్శకుడు మహేశ్
- ఈ నెల 27న థియేటర్లలోకి రానున్న రామ్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’
- ఉపేంద్ర చెప్పిన మాట స్ఫూర్తితో ఈ సినిమా కథ రాసుకున్న దర్శకుడు
- 2002 నాటి ఫ్యాన్ కల్చర్ నేపథ్యంలో సాగే రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్
- అభిమాని పాత్రకు రామ్ పోతినేని సరైన ఎంపిక అని తెలిపిన చిత్రబృందం
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మహేశ్ బాబు పి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషించడం సినిమాపై అంచనాలను పెంచింది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్‌కు మంచి స్పందన వచ్చింది.
ఈ సందర్భంగా దర్శకుడు మహేశ్ బాబు మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ కథ 2002 కాలంలో నడుస్తుందని, అప్పటి ఫ్యాన్ కల్చర్‌ను, హీరోల పట్ల అభిమానులు చూపించే ప్రేమను ఈ చిత్రంలో బలంగా చూపించబోతున్నామని తెలిపారు. అందుకే ఈ టైటిల్ సరిగ్గా సరిపోయిందని, దాని వెనుక ఉన్న అసలు అర్థం థియేటర్‌లో తెలుస్తుందని అన్నారు.
ఈ సినిమా కథ పుట్టడానికి గల కారణాన్ని వివరిస్తూ, ‘‘రానా హోస్ట్ చేసిన ఓ ఇంటర్వ్యూలో ఉపేంద్ర గారు ‘నిజమైన నన్ను సినిమాల్లోనే చూస్తారు’ అని చెప్పిన మాట నాలో బలంగా నాటుకుపోయింది. అదే ఈ కథకు బీజం వేసింది. ఒక అభిమాని తన హీరోను ఎలా చూస్తాడు, ఆ ప్రేమలో ఎంత భావోద్వేగం ఉంటుందనే కోణంలో సూర్య అనే పాత్రను సృష్టించాను. ఆ పాత్రకు ఉపేంద్ర గారు అయితేనే బాగుంటుందనిపించింది’’ అని మహేశ్ బాబు తెలిపారు.
‘‘ఈ కథను రామ్‌కు చెప్పగానే వెంటనే ఒప్పుకున్నారు. అభిమాని పాత్రకు కావాల్సిన ఎనర్జీ, మాస్ వైబ్, ఎమోషన్ రామ్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఆయన ఈ సినిమాకు సరైన ఎంపిక. హీరోయిన్ పాత్ర కూడా కథలో కీలక మలుపు తీసుకువస్తుంది. వివేక్-మెర్విన్ అందించిన సంగీతం సినిమాకు ప్రాణం పోసింది’’ అని దర్శకుడు ధీమా వ్యక్తం చేశారు. దక్షిణాది ప్రేక్షకులు హీరోలను తమ జీవితంలో భాగంగా చూస్తారని, ఆ స్వచ్ఛమైన ప్రేమను ఈ సినిమాలో చూపిస్తామని ఆయన వివరించారు.