Kokapet: కోకాపేటలో ఎకరం భూమి ధర రూ.137 కోట్లు

Kokapet Land Price Reaches Record 137 Crores Per Acre
  • నియోపొలిస్ ప్రాంతంలో అత్యధిక ధర పలికిన ఎకరం భూమి
  • సర్వే నెంబర్ 17, 18లలో భూములను వేలం వేసిన హెచ్ఎండీఏ
  • రెండు సర్వే నెంబర్లలో కలిపి సమకూరిన రూ.1,355 కోట్ల ఆదాయం
హైదరాబాద్ నగరంలో భూముల ధరలు మరోసారి ఆకాశాన్నంటాయి. కోకాపేటలోని నియోపొలిస్ ప్రాంతంలో ఎకరం భూమి రికార్డు స్థాయిలో రూ.137.25 కోట్లకు అమ్ముడుపోయింది. సర్వే నెంబర్ 17, 18లలోని భూములకు హెచ్ఎండీఏ అధికారులు వేలం నిర్వహించారు. సర్వే నెంబర్ 17లో 4.59 ఎకరాలు, సర్వే నెంబర్ 18లో 3.51 ఎకరాల భూమి ఉండగా, వేలంలో ఎకరం భూమి రూ.137 కోట్లకు పైగా ధర పలికింది.

హెచ్ఎండీఏ పరిధిలోని ఖరీదైన భూములను ఆన్‌లైన్‌లో వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. మొత్తం 9.90 ఎకరాలకు గాను రూ.1,355.33 కోట్ల ఆదాయం హెచ్ఎండీఏకు సమకూరింది.

కొద్ది రోజుల క్రితం రాయదుర్గంలోని 7.67 ఎకరాలకు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ నిర్వహించిన వేలంలో రూ.1,357 కోట్లకు ఒక సంస్థ దక్కించుకుంది. అక్కడ కనీస ధర ఎకరాకు రూ.101 కోట్లుగా నిర్ణయించగా, వేలంలో రూ.177 కోట్లు పలికింది. ఈ నేపథ్యంలో తాజాగా కోకాపేట నియోపొలిస్‌లోని భూములకు ఎకరం కనీస ధర రూ.99 కోట్లు నిర్ణయించగా, రూ.137.25 కోట్లు పలికింది.
Kokapet
Kokapet land auction
Hyderabad land prices
Neopolis Kokapet
HMDA

More Telugu News