Petrofac: దివాలాకు దరఖాస్తు చేసుకున్న బ్రిటన్ ఇంధన సంస్థ.. భారతీయ ఉద్యోగుల్లో ఆందోళన
- ఆందోళనలో కంపెనీ ఉద్యోగులు
- భారత్ లో ఈ కంపెనీకి 8,500 మంది ఉద్యోగులు
- ఇంధన సేవల్లో ఒకప్పుడు పేరొందిన పెట్రోఫాక్
- అవినీతి, కుంభకోణాల్లో చిక్కుకుని ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోయిన కంపెనీ
బ్రిటన్‌కు చెందిన ఇంధన సేవల సంస్థ పెట్రోఫాక్ దివాలాకు వెళ్లడంతో ఆ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల భవితవ్యంపై ఆందోళన నెలకొంది. భారత్ లో ఈ కంపెనీకి 8,500 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒకప్పుడు ఇంధన రంగంలో పేరుగాంచిన పెట్రోఫాక్ అవినీతి, కుంభకోణాల కారణంగా ఆర్థికంగా నష్టాలపాలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే వందలాది ఉద్యోగులను తొలగించగా, తాజాగా కంపెనీ దివాలాకు దరఖాస్తు చేసుకోవడంతో మిగతా ఉద్యోగుల్లోనూ ఆందోళన మొదలైంది.
2011లో పెట్రోఫాక్ ఎగ్జిక్యూటివ్స్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కాంట్రాక్టులు పొందేందుకు కొందరు అధికారులకు లంచాలు ఇచ్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారం న్యాయపరమైన చిక్కులకు దారితీసింది. 2017లో యూకే సీరియస్ ఫ్రాడ్ ఆఫీస్ ఈ కంపెనీపై దర్యాప్తు ప్రారంభించింది. ఆ తర్వాత నుంచి పెట్రోఫాక్ పరిస్థితి మరింత దిగజారుతూ వచ్చింది. ఆరేళ్ల క్రితం కంపెనీ మాజీ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ లుఫ్కిన్ లంచం కేసులో దోషిగా తేలారు.
విచారణలో అతను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా న్యాయస్థానం కంపెనీకి 77 మిలియన్ పౌండ్ల జరిమానా విధించింది. ఈ తీర్పు పెట్రోఫాక్‌కు ఆర్థికంగా భారీ నష్టం కలిగించింది. ఆ తరువాత కీలక ఒప్పందాలు రద్దు కావడంతో ఆదాయం తగ్గి, రుణభారం పెరిగింది.
ప్రస్తుతం పెట్రోఫాక్ కంపెనీ 4 బిలియన్ డాలర్ల అప్పుల్లో కూరుకుపోయిందని అంచనా. ఆర్థిక పునరుద్ధరణకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో దివాలా ప్రక్రియకు దరఖాస్తు చేసుకుంది. లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నుంచి డీలిస్ట్ కూడా అయింది. దీంతో కంపెనీ భవిష్యత్తు సందిగ్ధంలో పడింది. యూఏఈలోని ఈ కంపెనీలో పనిచేస్తున్న వందలాది మంది ఉద్యోగులను తొలగించారు. ఈ కంపెనీలో సుమారు 8,500 మంది భారతీయులు పనిచేస్తున్నారు.