Jabardasth Naresh: కొంతమంది నన్ను మోసం చేశారు: 'జబర్దస్త్' నరేశ్!

Jabardasth Naresh Interview
  • 'జబర్దస్త్'తో పాప్యులర్ అయిన నరేశ్
  • అంతకుముందు కష్టాలు పడ్డానని వెల్లడి  
  • 600 స్కిట్స్ వరకూ చేశానని వివరణ 
  • వివాదాల జోలికి వెళ్లనని వ్యాఖ్య 
  • అవకాశాల గురించిన భయం ఉంటుందన్న నరేశ్

'జబర్దస్త్' కామెడీ షో ద్వారా చాలామంది కమెడియన్స్ పాప్యులర్ అయ్యారు. వాళ్లలో నరేశ్ ఒకరు. ఎప్పుడు చూసినా చిన్నపిల్లాడిగా కనిపించే నరేశ్, తనదైన డైలాగ్ డెలివరీతో నవ్వులు పూయిస్తూ ఉంటాడు. అలాంటి నరేశ్ తాజాగా 'బిగ్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి మాట్లాడాడు. " కష్టం అంటే ఎలా ఉంటుందనేది నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఆర్ధిక పరమైన ఇబ్బందులు పడుతూనే వచ్చాను. అలాంటి కష్టాలు మళ్లీ రాకూడదని కోరుకుంటాను" అని అన్నాడు.

'ఢీ జూనియర్స్' కోసం వచ్చిన నేను, అనుకోకుండా 'జబర్దస్త్' వైపు వెళ్లాను. సుధాకర్ - చంటి ఇద్దరూ కూడా నన్ను 'జబర్దస్త్' స్టేజ్ పైకి తీసుకుని వెళ్లారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూసుకున్నది లేదు. అందరితో కలిసి పనిచేశాను. దాదాపు 600 స్కిట్స్ వరకూ చేశాను. నేను చాలా కమర్షియల్ అనుకుంటారుగానీ, అలాంటిదేమీ లేదు. నాకు ఏదైనా సమస్య వస్తే, ముందుగా హైపర్ ఆదికీ .. బుల్లెట్ భాస్కర్ కి చెప్పుకుంటాను. కొంతమంది మాత్రం డబ్బు విషయంలో నన్ను మోసం చేశారు. ఆ నష్టం నుంచి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది" అని చెప్పాడు. 

పండుగల సమయాల్లో ఈవెంట్స్ ఎక్కువగా ఉంటాయి. పారితోషికం విషయంలో ఎవరినీ డిమాండ్ చేయను. నా పని నేను చేసుకుంటూ వెళతాను. ఎవరితో ఎలాంటి వివాదాల జోలికి వెళ్లను. సాధ్యమైనంత వరకూ పగలు... ప్రతీకారాలు అంటూ మనసు పాడుచేసుకోను. హ్యాపీగా ఉండటానికే ప్రయత్నిస్తూ ఉంటాను. కాకపోతే అవకాశాలు ఎప్పుడు ఉంటాయో... ఎప్పుడు ఉండవో తెలియదు గనుక, అప్పుడప్పుడు భయం వేస్తూ ఉంటుంది" అని అన్నాడు.


Jabardasth Naresh
Naresh Jabardasth
Jabardasth comedy show
Telugu comedy
Hyper Aadi
Bullet Bhaskar
Dhee Juniors
Telugu events
Telugu comedian
Telugu TV

More Telugu News