Smriti Mandhana: స్మృతి మంధాన కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ కు అస్వస్థత

Smriti Mandhana Fiance Palash Muchhal Ill After Fathers Hospitalization
  • ఛాతి నొప్పితో ఇబ్బంది పడ్డ మహిళా క్రికెటర్ తండ్రి
  • అర్ధాంతరంగా నిలిచిన వివాహ వేడుక.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు
  • ఆ తర్వాత కాబోయే భర్తకూ అనారోగ్యం.. చికిత్స తర్వాత డిశ్చార్జ్
ప్రముఖ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన తండ్రి అస్వస్థతతో ఆసుపత్రి పాలవడంతో ఆదివారం జరగాల్సిన ఆమె వివాహం అగిపోయిన విషయం తెలిసిందే. వివాహ వేడుకలో స్మృతి తండ్రి శ్రీనివాస్ మందన్న ఛాతి నొప్పితో ఇబ్బంది పడ్డారు. గుండె పోటు లక్షణాలు కనిపించడంతో ఆయనను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

తండ్రి అనారోగ్యం కారణంగా వివాహ తంతును కొనసాగించేందుకు స్మృతి అంగీకరించలేదు. దీంతో వివాహం వాయిదా పడింది. ఓవైపు తండ్రి ఆసుపత్రిలో చేరగా.. ఆ తర్వాత కాసేపటికి స్మృతి కాబోయే భర్త పలాశ్ ముచ్ఛల్ కూడా అస్వస్థతకు గురయ్యారని సమాచారం. వైరల్ ఇన్ఫెక్షన్ తో అనారోగ్యంపాలైన పలాశ్ ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారని తెలుస్తోంది. అయితే, ఆయన అనారోగ్యం ప్రమాదకరమైనదేమీ కాదని, చికిత్స తర్వాత వెంటనే పలాశ్ ను డిశ్చార్జ్ చేశామని వైద్యులు తెలిపారు.

వైద్యుల పర్యవేక్షణలో స్మృతి తండ్రి..
ఛాతి నొప్పితో ఆసుపత్రిలో చేరిన స్మృతి తండ్రి శ్రీనివాస్ మందన్నను వైద్యుల బృందం అబ్జర్వేషన్ లో ఉంచింది. ఇప్పటికే పలు ఆరోగ్య పరీక్షలు నిర్వహించగా.. ఈ రోజు ఆంజియోగ్రఫీ పరీక్ష చేయనున్నట్లు వైద్యులు తెలిపారు. శ్రీనివాస్ అధిక రక్తపోటు, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.
Smriti Mandhana
Palash Muchhal
Smriti Mandhana wedding
Srinivas Mandhana
Indian women's cricket
heart attack
viral infection
angiography
hospitalized
health update

More Telugu News