C Kalyan: ఆయనను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధేంటో తెలుస్తుంది: 'ఐబొమ్మ' రవి తండ్రి అప్పారావు

C Kalyan Encounter Comment Ibomma Ravi Father Apparao Reaction
  • నిర్మాత సీ.కల్యాణ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన 'ఐబొమ్మ' రవి తండ్రి
  • 'ఐబొమ్మ' రవిని ఎన్‌కౌంటర్ చేయాలన్న నిర్మాత సి.కల్యాణ్
  • మిమ్మల్ని ఎన్‌కౌంటర్ చేస్తే ఆ నొప్పి ఏంటో తెలుస్తుందన్న అప్పారావు
  • సినిమాల్లో విషయం ఉంటే ప్రేక్షకులు తప్పక చూస్తారని వ్యాఖ్య
  • కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీయమని ఎవరూ అడగలేదంటూ ఆగ్రహం
  • కొడుకు తరపు న్యాయవాదికి ఆర్థిక సాయం చేస్తానని ప్రకటన
'ఐబొమ్మ' పైరసీ వెబ్ సైట్ వ్యవహారంలో నిర్మాత సి.కల్యాణ్ చేసిన "ఎన్‌కౌంటర్" వ్యాఖ్యలపై 'ఐబొమ్మ' రవి తండ్రి అప్పారావు తీవ్రంగా స్పందించారు. సి.కల్యాణ్‌ను ఎన్‌కౌంటర్ చేస్తే ఆ బాధ ఏంటో తెలుస్తుందని ఆయన ఘాటుగా బదులిచ్చారు. తన కుమారుడిని ఉద్దేశించి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు.

ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ.. "సినిమాలో సరైన విషయం ఉంటే ప్రేక్షకులు కచ్చితంగా థియేటర్లకు వచ్చి చూస్తారు. నేను ఒకప్పుడు 45 పైసలకే సినిమా చూశాను. కానీ ఇప్పుడు టికెట్ ధరలను దారుణంగా పెంచేశారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి సినిమాలు ఎవరు తీయమంటున్నారు?" అని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమ తమ తప్పులను సరిదిద్దుకోవాలి తప్ప, ఇతరులపై నిందలు వేయడం సరికాదన్నారు.

అంతేకాకుండా, తన కుమారుడి తరఫున వాదిస్తున్న న్యాయవాదికి తాను ఆర్థికంగా అండగా ఉంటానని అప్పారావు స్పష్టం చేశారు. ఈ విషయంలో న్యాయపరంగానే ముందుకు వెళతామని ఆయన వెల్లడించారు.

తెలుగు సినిమా పరిశ్రమకు 'ఐబొమ్మ' వల్ల వేల కోట్ల నష్టం వాటిల్లిందని, 'ఐబొమ్మ' రవి వంటి వారిని ఎన్‌కౌంటర్ చేయాలని నిర్మాత సి.కల్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే రవి తండ్రి అప్పారావు తాజాగా స్పందించారు.
C Kalyan
Ibomma Ravi
Apparao
C Kalyan Encounter
Ibomma
Telugu Cinema
Piracy Website
Movie Tickets Price
Film Industry
Tollywood

More Telugu News