Work From Hospital: పురుటి నొప్పులతో భార్య.. అయినా వర్క్ ఫ్రం హాస్పిటల్ చేయాలన్న మేనేజర్

Corporate Employee Forced Work From Hospital During Wife Delivery
  • ఆసుపత్రిలో నువ్వు చేసేదేముంటుందని ఎద్దేవా
  • రెడ్డిట్ లో వైరల్ గా మారిన ఉద్యోగి పోస్ట్
  • మేనేజర్ తీరుపై దుమ్మెత్తిపోస్తున్న యూజర్లు
కార్పొరేట్ కంపెనీల పని సంస్కృతిపై ఉద్యోగులు తరచుగా విమర్శలు చేస్తుండడం చూస్తూనే ఉంటాం.. అనారోగ్యంతో ఉన్నా, ఆసుపత్రి బెడ్ మీద ఉన్నా వర్క్ చేయాలంటూ బాస్ ఆదేశించిడమూ తెలుసు. తాజాగా ఇలాంటి అనుభవమే ఓ ఉద్యోగికి ఎదురైంది. ఈ విషయాన్ని ఆయన తన రెడ్డిట్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. ఓవైపు తన భార్య పురుటి నొప్పులతో ఆసుపత్రిలో ఉందని చెప్పినా మేనేజర్ తనను వర్క్ ఫ్రం హాస్పిటల్ చేయాలని అడిగాడంటూ ఆ పోస్టులో పేర్కొన్నాడు. దీంతో సదరు మేనేజర్ పై సోషల్ మీడియా యూజర్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
 
ఇండియన్ వర్క్ ప్లేస్ అనే రెడ్డిట్ యూజర్ పోస్ట్ చేసిన వివరాల ప్రకారం.. ఓ కార్పొరేట్ కంపెనీ ఉద్యోగి భార్య నిండు గర్భిణీ. డెలివరీ కోసం ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు. ఆపై విషయం స్పష్టంగా వివరిస్తూ రెండు రోజులు సెలవు కావాలంటూ మేనేజర్ కు మెసేజ్ చేశాడు. దీనికి మేనేజర్ ఇచ్చిన జవాబు చూసి తీవ్ర అసంతృప్తికి లోనయ్యాడు. ‘ఇప్పుడు సెలవు ఇవ్వడం కుదరదు. వచ్చే వారం తీసుకుందువులే. అయినా మీ ఆవిడ డెలివరీకి నువ్వు చేసేదేముంది? ఆసుపత్రి నుంచే వర్క్ చేయొచ్చు కదా’ అంటూ ఆ మేనేజర్ జవాబిచ్చాడు.

‘అలా కుదరదండి, ఆసుపత్రిలో పేషెంట్ ను చూసుకోవాల్సింది నేనే. మెడికల్ షాపుకు వెళ్లడం, ఇతరత్రా పనులు ఉంటాయి. పైగా ఆసుపత్రి నుంచి ఆఫీసు వర్క్ చేయడం వీలుకాదు’ అని ఆ ఉద్యోగి చెప్పడంతో అయిష్టంగానే మేనేజర్ సెలవు మంజూరు చేశాడు.
Work From Hospital
Corporate Employee
Wife Delivery
Hospital Duty
Leave Request
Manager Pressure
Employee Stress
Indian Workplace Culture

More Telugu News