Emmanuel Macron: జీ-20 కూటమి ఉనికి ప్రమాదంలో ఉంది: మేక్రాన్ సంచలన వ్యాఖ్యలు

Emmanuel Macron Warns G20 Existence at Risk
  • జోహన్నస్‌బర్గ్ వేదికగా జీ-20 సదస్సు
  • కలిసికట్టుగా పోరాడటంలో కూటమి ఇబ్బంది పడుతోందన్న ఫ్రాన్స్ అధ్యక్షుడు
  • సమష్టిగా కృషి చేయకుంటే జీ-20 ప్రమాదంలో పడుతుందని హెచ్చరిక
జీ-20 సదస్సులో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సంక్షోభాలను పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కూటమి ఉనికి ప్రమాదంలో ఉందని ఆయన హెచ్చరించారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నస్‌బర్గ్ వేదికగా జీ-20 సదస్సు జరుగుతోన్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా మేక్రాన్ మాట్లాడుతూ, ప్రధాన సంక్షోభాలను పరిష్కరించేందుకు కలిసికట్టుగా పోరాడటంలో కూటమి ఇబ్బందులు పడుతోందని అన్నారు. ఉక్రెయిన్ ప్రజల సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా అక్కడ శాంతి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా జీ-20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కాకపోవడాన్ని ఆయన ప్రస్తావించారు.

కొన్ని ప్రాధాన్యాలపై సమష్టిగా కృషి చేయకుంటే జీ-20 ప్రమాదంలో పడుతుందని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రపంచ నేతలు గుర్తించాలని సూచించారు. గతంలో కూడా మేక్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధానికి ముందు, నాటో కూటమి బ్రెయిన్ డెడ్ అయిందంటూ వ్యాఖ్యానించారు.
Emmanuel Macron
France
G20 Summit
Ukraine
Russia
International Relations

More Telugu News