Ajit Pawar: అలా చేస్తే నిధులివ్వను: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వ్యాఖ్యలు వివాదాస్పదం

Ajit Pawar Funds Remark Sparks Controversy
  • బారామతిలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అజిత్ పవార్
  • తమ పార్టీ అభ్యర్థులను తిరస్కరిస్తే నిధులు కేటాయింపులో అలాగే ఉంటానని వ్యాఖ్య
  • అజిత్ పవార్ ఓటర్లు బెదిరిస్తున్నారన్న విపక్షాలు
ఎన్సీపీ అభ్యర్థులను గెలిపిస్తేనే అభివృద్ధికి నిధుల కొరత లేకుండా చూస్తానని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో బారామతిలో నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను తిరస్కరిస్తే నిధుల కేటాయింపు విషయంలో తానూ అదే విధంగా వ్యవహరిస్తానని వ్యాఖ్యానించారు.

స్థానికంగా ఎన్సీపీకి చెందిన 18 మంది అభ్యర్థులను గెలిపిస్తేనే ఆ ప్రాంత అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని ఆయన అన్నారు. హామీలను నెరవేర్చే విషయంలో తాను కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. "మీ వద్ద ఓట్లు ఉన్నాయి, నా వద్ద నిధులు ఉన్నాయి. మీరు తిరస్కరిస్తే నేను కూడా తిరస్కరిస్తాను" అని ఆయన హెచ్చరించారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా తన వద్ద నిధులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.

అజిత్ పవార్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. ఆయన ఓటర్లను బెదిరింపులకు గురిచేస్తున్నారని విమర్శించాయి. అజిత్ పవార్ తన సొంత నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు మాట్లాడుతున్నారని, ప్రజలు కట్టిన పన్నుల ద్వారానే నిధులు విడుదల అవుతాయని శివసేన (యూబీటీ) నేత ఆంబాదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ajit Pawar
Maharashtra Deputy Chief Minister
NCP
Baramati
Funds Allocation

More Telugu News