పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్.. రిజర్వేషన్లపై జీవో విడుదల
- గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై ప్రభుత్వ జీవో
- 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు ఖరారు
- రొటేషన్ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లు
- 100 శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామాల్లో అన్ని స్థానాలు వారికే
ప్రభుత్వం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా రిజర్వేషన్లను రొటేషన్ పద్ధతిలో అమలు చేయనున్నారు. ఈ పద్ధతి ద్వారా అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించింది.
ఈ జీవోలో గిరిజన గ్రామాలకు సంబంధించి ఒక ప్రత్యేక నిబంధనను చేర్చింది. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలు అన్నీ ఎస్టీలకే రిజర్వ్ చేయబడతాయని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ఘట్టం పూర్తికావడంతో త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.