CRDA meeting: రైతులకు అన్యాయం జరగనివ్వం.. సీఆర్డీఏ మీటింగ్ లో మంత్రి నారాయణ

CRDA Meeting Narayana assures farmers on land issues
  • సీఆర్డీఏ కార్యాలయంలో ఈరోజు సమావేశమైన త్రిసభ్య కమిటీ
  • రైతు జేఏసీ ప్రతినిధులు కూడా హాజరు
  • రైతులు లేవనెత్తిన అంశాలపై చర్చ
ప్రభుత్వంపై విశ్వాసంతో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈమేరకు ఈ రోజు ఉదయం జరిగిన సీఆర్డీఏ సమావేశంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. రాజధాని రైతుల సమస్యల పరిష్కారంపై సీఆర్డీఏ కార్యాలయంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ల త్రిసభ్య కమిటీ సమావేశమైంది.

ఈ సమావేశంలో సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, ముఖ్య అధికారులతో పాటు రైతు జేఏసీ ప్రతినిధులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా రైతులు లేవనెత్తిన పలు అంశాలపై చర్చ జరిగింది. వాటి పరిష్కారం కోసం కమిటీ సమాలోచనలు చేసింది. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నమ్మకంతో భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగదని చెప్పారు. ఏ రైతుకూ ఇబ్బంది లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.

కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం జగన్ కారణంగా అమరావతిలో అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని చెప్పారు. రాజధానిలో పెండింగ్‌ లో ఉన్న జరీబు భూముల సమస్యకు 30 రోజుల్లో పరిష్కారం చూపిస్తామని హామీ ఇచ్చారు. గ్రామ కంఠాలు, లంక భూముల సమస్యలనూ పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అసైన్డ్‌ భూములను అమ్ముకోకుండా జగన్‌ ప్రభుత్వం అడ్డుకుందన్నారు. 

రాజధాని ప్రాంతంలోని అసైన్డ్ భూములకు మిగతా అసైన్డ్ భూములకు వ్యత్యాసం ఉందని మంత్రి గుర్తు చేశారు. ఈ సమస్యను మూడు నెలల్లో పరిష్కరిస్తామని చెప్పారు. భూములు ఇచ్చిన రైతుల్లో 90 శాతం మందికి ప్లాట్ల కేటాయింపు పూర్తయిందని, మరో 20 రోజుల్లో డీపీఆర్‌ సిద్ధం చేస్తామని పేర్కొన్నారు. వచ్చే జూన్‌ నాటికి రాజధాని గ్రామాల్లో తాగునీరు, డ్రెయిన్ల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు.
CRDA meeting
Amaravati farmers
Land issues
Narayana
AP Minister Narayana
Pattipati Pulla Rao
Pemaasani Chandrasekhar
Andhra Pradesh
Capital region development authority
Farmer welfare

More Telugu News