Droupadi Murmu: పుట్టపర్తికి రాష్ట్రపతి.. ఘనస్వాగతం పలికిన సీఎం చంద్రబాబు

President Droupadi Murmu Visits Puttaparthi Welcomed by CM Chandrababu
  • సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు పుట్టపర్తికి రాష్ట్రపతి
  • ద్రౌపదీ ముర్ముకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌
  • ప్రశాంతి నిలయంలో జరుగుతున్న వేడుకల్లో పాల్గొంటున్న ప్రముఖులు
  • సాయంత్రం సత్యసాయి వర్సిటీ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి హాజరు
పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం పుట్టపర్తికి విచ్చేశారు. పుట్టపర్తి విమానాశ్రయంలో ఆమెకు సీఎం చంద్రబాబు.. ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌, ఇతర ప్రజాప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు.

అనంతరం రాష్ట్రపతి ప్రశాంతి నిలయంలో జరిగిన సత్యసాయి బాబా 100వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సీఎం, మంత్రి లోకేశ్‌ పుట్టపర్తి చేరుకోగా, వారికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు స్వాగతం పలికారు.

కాగా, సాయంత్రం జరగనున్న శ్రీ సత్యసాయి యూనివర్సిటీ 44వ స్నాతకోత్సవానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ స్నాతకోత్సవంలోనూ సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ పాల్గొంటారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రి పర్యటనలతో పుట్టపర్తిలో సందడి వాతావరణం నెలకొంది.

Droupadi Murmu
Puttaparthi
Chandrababu Naidu
Nara Lokesh
Satya Sai Baba
Satya Sai Baba Centenary Celebrations
Sri Satya Sai University
AP News
Radhakrishnan

More Telugu News