Formula E Race: ఫార్ములా ఈ రేస్ లో క్విడ్ ప్రో కో.. బీఆర్ఎస్ పార్టీకి రూ.44 కోట్లు.. ఏసీబీ నివేదికలో వెల్లడి!

KTR Formula E Race Scam BRS Received 44 Crore ACB Report
  • ఏసీబీ దర్యాప్తు ఫైనల్ రిపోర్ట్ లో సంచలన విషయాలు
  • రేస్ నిర్వహించాలన్నది కేటీఆర్ సొంత నిర్ణయమేనట
  • ఆర్థిక శాఖతో పాటు ముఖ్యమంత్రికీ ముందస్తు సమాచారం ఇవ్వలేదని వెల్లడి
బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ లో భారీగా అవినీతి జరిగిందని ఏసీబీ నివేదిక తేల్చింది. ఈ రేస్ నిర్వహించాలన్నది అప్పటి మంత్రి, బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సొంత నిర్ణయమేనని వెల్లడించింది. 

రేస్ నిర్వహణలో క్విడ్ ప్రో కో జరిగిందని, ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి రూ.44 కోట్లు ముట్టజెప్పిందని సెప్టెంబర్ 9న ప్రభుత్వానికి సమర్పించిన తుది నివేదికలో ఏసీబీ పేర్కొంది. ఈ అక్రమ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అరవింద్ కుమార్, ఏ3 గా బిఎల్ఎన్ రెడ్డి, ఏ4గా, ఏ5లుగా ఎఫ్ఈవో ప్రతినిధులను చేర్చింది.

ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేట్ డిస్కషన్లతో రేస్ నిర్వహించారని ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఈ రేస్ ప్రమోటర్ గా వ్యవహరించిన ఏస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ట్రైపార్టీ అగ్రిమెంట్ కు ముందే.. అంటే 2022 ఏప్రిల్, అక్టోబర్ నెలలో బీఆర్ఎస్ పార్టీకి రూ.44 కోట్లు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో విరాళం ఇచ్చిందని తెలిపింది. ఆ తర్వాతే ఈ కంపెనీకి ఈ రేస్ ప్రమోటర్ గా ప్రభుత్వం అవకాశం కల్పించిందని పేర్కొంది. గవర్నర్ సంతకం లేకుండా, ఆర్థిక శాఖ ముందస్తు అనుమతి లేకుండానే అప్పటి ఐఏఎస్ అరవింద్ కుమార్ ఈ రేస్ కాంట్రాక్టులకు ఆమోదముద్ర వేశారని ఏసీబీ విచారణలో వెల్లడైంది.

2023 అక్టోబర్ 9 నుండి డిసెంబర్ 4 వరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని గుర్తు చేస్తూ.. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో రూ.10 కోట్ల కంటే ఎక్కువ నిధులు చెల్లించాల్సి వస్తే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాలని ఏసీబీ పేర్కొంది. అయితే, ఈ రేస్ నిర్వహణకు సంబంధించి ఈ నిబంధనను పాటించలేదని, అప్పటి సీఎస్ తో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా ముందస్తు సమాచారం ఇవ్వలేదని ఏసీబీ తన నివేదికలో వెల్లడించింది.
Formula E Race
KTR
Quid Pro Quo
BRS Party
Hyderabad
ACB Report
Corruption
Electoral Bonds
Aravind Kumar
Ace Next Gen

More Telugu News