India A vs Bangladesh A: ఒక్క వైడ్ బాల్‌తో ఓటమి.. సూపర్ ఓవర్‌లో భారత్‌కు ఘోర పరాజయం

India A Team Loses to Bangladesh A in Super Over Thriller
  • ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీ నుంచి ఇండియా-ఏ నిష్క్రమణ
  • సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్-ఏ చేతిలో సూపర్ ఓవర్లో ఓటమి
  • సూపర్ ఓవర్‌లో సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్
  • వైడ్ బాల్‌తో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లిన బంగ్లాదేశ్
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నమెంట్‌లో ఇండియా-ఏ జట్టుకు ఊహించని పరాజయం ఎదురైంది. నిన్న దోహాలో బంగ్లాదేశ్-ఏ జట్టుతో జరిగిన ఉత్కంఠభరిత సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో ఓటమి పాలైంది. ఈ విజయంతో బంగ్లాదేశ్-ఏ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-ఏ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించాల్సి వచ్చింది. అయితే, సూపర్ ఓవర్‌లో భారత జట్టు దారుణంగా విఫలమైంది.

బంగ్లాదేశ్ పేసర్ రిపన్ మండల్ అద్భుతంగా బౌలింగ్ చేసి, వేసిన తొలి రెండు బంతులకే రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇండియా-ఏ ఒక్క పరుగు కూడా చేయకుండానే ఆలౌటైంది. అనంతరం, ఒక్క పరుగు లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు కూడా తొలి బంతికే ఎదురుదెబ్బ తగిలింది. యాసిర్ అలీ లాంగాన్‌లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే, ఆ తర్వాతి బంతిని భారత బౌలర్ సుయాశ్ శర్మ వైడ్‌గా వేయడంతో బంగ్లాదేశ్-ఏ ఒక్క పరుగుతో నాటకీయ విజయాన్ని అందుకుని ఫైనల్‌లో అడుగుపెట్టింది.
India A vs Bangladesh A
India A Team
Asia Cup Rising Stars 2025
Bangladesh A Team
Super Over
Cricket
Doha
Suyash Sharma
Ripan Mondal
Cricket Match
India vs Bangladesh

More Telugu News