ఆదర్శ వివాహం.. గుడిలో ఒక్కటైన యువ ఐఏఎస్ జంట
- నిరాడంబరంగా ఒక్కటైన ఇద్దరు ఐఏఎస్ అధికారులు
- పాడేరు ఐటీడీఏ పీవో శ్రీ పూజ, మేఘాలయ జేసీ ఆదిత్యవర్మ వివాహం
- కైలాసగిరి శివాలయంలో దండలు మార్చుకున్న జంట
- రిజిస్ట్రార్ కార్యాలయంలో సంతకాలతో చట్టబద్ధంగా ఒక్కటైన వైనం
విశాఖలోని కైలాసగిరిపై ఉన్న శివాలయంలో ఇరువురూ దండలు మార్చుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమానికి కేవలం ఇరు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం వీరిద్దరూ నేరుగా వన్‌టౌన్‌లోని జాయింట్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి సంతకాలు చేసి తమ వివాహాన్ని చట్టబద్ధంగా నమోదు చేసుకున్నారు. విశాఖపట్నం డీఐజీ బాలకృష్ణ దగ్గరుండి ఈ వివాహ నమోదు ప్రక్రియను పర్యవేక్షించారు.
వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు బ్యాచ్‌లకు చెందిన ఈ ఇద్దరు అధికారులది పెద్దలు కుదిర్చిన వివాహమని వధువు తండ్రి వెంకటేశ్వర్లు తెలిపారు. భారీ ఖర్చుతో పెళ్లిళ్లు జరుగుతున్న ఈ రోజుల్లో ఉన్నత హోదాలో ఉన్న అధికారులు ఇలా నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.