Pradhan Mantri: 'ప్రధానమంత్రి ఉచిత స్కూటీ స్కీం': పీఐబీ ఫ్యాక్ట్ చెక్ ఏం చెప్పిందంటే?

Pradhan Mantri Free Scooty Scheme PIB Fact Check Reveals Truth
  • ఉచిత స్కూటీ పథకం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయిన వార్త
  • ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక
  • ఉచిత స్కూటీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాలేదని స్పష్టీకరణ
'ప్రధానమంత్రి ఉచిత స్కూటీ యోజన' పేరుతో కేంద్ర ప్రభుత్వం పథకం అమలు చేస్తోందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలో నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కళాశాలలకు వెళ్లే యువతులకు ఉచితంగా స్కూటీలను పంపిణీ చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఇలాంటి స్కాంల ఉచ్చులో పడవద్దని హెచ్చరించింది.

ఈ ప్రచారంలో నిజం లేదని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం 'ఎక్స్' వేదికగా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం అలాంటి పథకాన్ని తీసుకురాలేదని తెలిపింది.

అధికారిక సమాచారం కోసం పీఐబీ ఫ్యాక్ట్ చెక్ లేదా సంబంధిత మంత్రిత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించాలని సూచించింది. వాట్సాప్, ఎస్సెమ్మెస్ లేదా ఈ-మెయిల్ ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులపై క్లిక్ చేయవద్దని కేంద్రం హెచ్చరిస్తోంది.
Pradhan Mantri
Free Scooty Scheme
PIB Fact Check
Fake News
Government Schemes

More Telugu News