Turku Avci: ఉగ్రవాదం కాదు అటువైపు నడవండి: భారత ముస్లిం మహిళలకు టర్కీ సామాజిక కార్యకర్త సూచన

Turku Avci urges Indian Muslim women towards empowerment
  • ఎర్రకోట పేలుడు ఘటనలో వైద్యురాలి పాత్ర ఉండటం చూసి షాకయ్యానని వెల్లడి
  • భారత్‌లోని ముస్లిం మహిళలు సాధికారత దిశగా ఆలోచన చేయాలని సూచన
  • విద్య, నాయకత్వం నుంచి సాధికారత వస్తుందని, హింస వల్ల కాదన్న తుర్కు అవ్సి
భారతదేశంలోని ముస్లిం మహిళలకు టర్కీ మహిళా సామాజిక కార్యకర్త కీలక విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదం కంటే సాధికారత వైపు చూడాలని వారు సూచించారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన కారు పేలుడు ఘటనలో ఒక మహిళా వైద్యురాలి పాత్ర ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతికి గురైనట్లు టర్కిష్ ప్రముఖ సామాజిక, శాంతి కార్యకర్త తుర్కు అవ్సి పేర్కొన్నారు. భారత్‌లోని ముస్లిం మహిళలు సాధికారత దిశగా ఆలోచన చేయాలని ఆమె అన్నారు.

ఇటీవల ఢిల్లీలో జరిగిన కాల్పుల ఘటన తనను ఎంతగానో బాధించిందని ఆమె అన్నారు. ఈ ఘటనలో ఒక మహిళ, పైగా వైద్యురాలు ఉండటం ఆశ్చర్యం కలిగించిందని, కానీ మన విశ్వాసం ఇలాంటి వాటిని బోధించదని ఆమె అన్నారు. మన భవిష్యత్తు తరాలు ఇలాంటి వారసత్వాన్ని కోరుకోబోరని ఆమె స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ముస్లిం మహిళలు వివిధ రంగాల్లో మహిళల స్థాయిని పెంచుతున్నారని ఆమె పేర్కొన్నారు. విశ్వాసం, సాధికారత ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయని తెలుసుకోవాలని ఆమె అన్నారు.

నిజమైన సాధికారత విద్య, నాయకత్వం, మంచితనం నుంచి వస్తుందని, కానీ హింస, రాడికలైజేషన్ వల్ల కాదని తుర్కు అన్నారు. ఈ సందర్భంగా అసోం మాజీ ముఖ్యమంత్రి సయ్యదా అన్వారా తైమూర్‌ను ఆమె గుర్తు చేశారు. అత్యున్నతస్థాయిలో మస్లిం మహిళా నాయకత్వానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని కొనియాడారు. ద్వేషంతో కూడుకున్న అన్ని భావజాలాలను తిరస్కరించాలని తుర్కు అవ్సి మధ్యప్రాచ్యం, యూరప్, భారతదేశంలోని ముస్లిం మహిళలకు విజ్ఞప్తి చేశారు.
Turku Avci
Indian Muslim women
Turkey
terrorism
empowerment
Delhi car blast

More Telugu News