Nitish Kumar: 20 ఏళ్ల తర్వాత హోంశాఖను వదులుకున్న నితీశ్ కుమార్, బీజేపీకి కేటాయింపు
- ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి హోంశాఖ కేటాయింపు
- నితీశ్ కుమార్ వద్ద సాధారణ పరిపాలన విభాగం, క్యాబినెట్ సెక్రటరియేట్, విజిలెన్స్ శాఖలు
- జేడీయూ సీనియర్ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌కు ఆర్థిక శాఖ కేటాయింపు
బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ దాదాపు 20 ఏళ్ల తర్వాత కీలకమైన హోంశాఖను వదులుకున్నారు. ఈ శాఖను బీజేపీ సీనియర్ నేత, ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరికి కేటాయించారు. బీహార్‌లో నితీశ్ కుమార్ సారథ్యంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. మంత్రులకు నితీశ్ కుమార్ శాఖల కేటాయింపు చేపట్టారు. శాఖల కేటాయింపునకు సంబంధించి శుక్రవారం అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది.
మరో ఉప ముఖ్యమంత్రి, బీజేపీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ సిన్హాకు రెవెన్యూ, భూసంస్కరణలు, భూగర్భ గనుల శాఖను అప్పగించారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తన వద్ద సాధారణ పరిపాలన విభాగం, క్యాబినెట్ సెక్రటరియేట్, విజిలెన్స్ తదితర శాఖలను అట్టిపెట్టుకున్నారు. జేడీయూ, బీజేపీ పొత్తులో ఉన్న ప్రతిసారి బీజేపీకి ఆర్థిక శాఖ కేటాయిస్తారు. కానీ ఈసారి జేడీయూ సీనియర్ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్‌కు ఆ శాఖను అప్పగించారు.