Vijay: సినీ నటుడు విజయ్‌కి షాకిచ్చిన తమిళనాడు పోలీసులు

Tamil Nadu Police Deny Permission for Actor Vijays Campaign
  • విజయ్ ప్రచారానికి అనుమతి నిరాకరించిన పోలీసులు
  • డిసెంబర్ 4న సేలంలో తలపెట్టిన సభకు అనుమతి నిరాకరణ
  • నాలుగు వారాల ముందే దరఖాస్తు చేసుకోవాలని సూచన
ప్రముఖ తమిళ నటుడు, టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌కి తమిళనాడు పోలీసులు షాక్ ఇచ్చారు. ఆయన ప్రచారానికి అనుమతి నిరాకరించారు. కొద్ది నెలల క్రితం జరిగిన కరూర్ దుర్ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డిసెంబర్ 4న సేలంలో నిర్వహించ తలపెట్టిన ప్రచార సభ కోసం టీవీకే పార్టీ పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేసింది. దీనిని పోలీసు శాఖ తిరస్కరించింది.

భవిష్యత్తులో విజయ్ ప్రచార సమావేశాలకు అనుమతి కోరినట్లయితే కార్యక్రమం తేదీకి నాలుగా వారాల ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. తొలుత భద్రతా సమస్యల కారణంగా అనుమతి ఇవ్వలేమని పోలీసులు పేర్కొన్నారు. ఆ తర్వాత పంపిన అధికారిక లేఖలో కారణాలను పేర్కొన్నారు.
Vijay
Vijay TVK Party
Tamil Nadu Police
Tamil Nadu Politics
TVK Party
Actor Vijay
Salem

More Telugu News