Chevireddy Bhaskar Reddy: నా ఆస్తులు జప్తు చేయడం ధర్మం కాదు: కోర్టులో చెవిరెడ్డి ఆవేదన

Liquor scam Chevireddy expresses distress over family assets seizure
  • లిక్కర్ స్కాంలో ఆస్తుల జప్తుపై స్పందించిన చెవిరెడ్డి
  • మద్యం వ్యాపారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టీకరణ
  • వారసత్వ ఆస్తులను జప్తు చేయడం ధర్మం కాదని వ్యాఖ్య
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో తన ఆస్తులను, తన కుటుంబ ఆస్తులను జస్తు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఇవ్వడంపై వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కుంభకోణంతో తనకు ఎలాంటి ప్రమేయం లేదని, ఒక్క రూపాయి కూడా మద్యం వ్యాపారం ద్వారా సంపాదించలేదని ఆయన స్పష్టం చేశారు. ఈరోజు విజయవాడ ఏసీబీ కోర్టులో ఈ మేరకు ఆయన తన వాదన వినిపించారు.

"నాకు లిక్కర్ వ్యాపారంతో ఎటువంటి సంబంధం లేదు. నేను సంపాదించిందంతా రియల్ ఎస్టేట్ ద్వారానే. కష్టపడి సంపాదించిన నా ఆస్తులను లిక్కర్ ద్వారా సంపాదించినట్లు ఆరోపించడం బాధాకరం. వందల ఏళ్లుగా మా కుటుంబానికి సంక్రమించిన వారసత్వ ఆస్తులను అటాచ్‌మెంట్ చేయడం ధర్మం కాదు" అని చెవిరెడ్డి అన్నారు.

ఈ కేసుల వల్ల తన కుటుంబం మొత్తం చిన్నాభిన్నమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను మాట్లాడకపోతే నిజంగానే తప్పు చేశానని ప్రజలు అనుకుంటారని, అందుకే వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. "కూటమి ప్రభుత్వం సంతృప్తి చెందే వరకు నన్ను జైలులో ఉంచినా భయపడను. ఎన్ని రోజులైనా జైలులో ఉండటానికి సిద్ధంగా ఉన్నాను" అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.
Chevireddy Bhaskar Reddy
Andhra Pradesh
Liquor Scam
ACB Court
Vijayawada
YSRCP
Assets Seizure
Real Estate
Political News
Telugu News

More Telugu News