Kadiyam Srihari: స్పీకర్ ప్రసాద్ కుమార్‌ను కలిసిన కడియం శ్రీహరి

Kadiyam Srihari Meets Speaker Prasad Kumar Seeking More Time
  • కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లకు స్పీకర్ నోటీసులు
  • ఫిరాయింపు ఫిర్యాదులపై సమాధానం ఇవ్వాలని పేర్కొన్న స్పీకర్
  • తనకు కొంత సమయం కావాలని అడిగిన కడియం శ్రీహరి
స్టేషన్ ఘనపూర్ శాసనసభ్యుడు కడియం శ్రీహరి తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిశారు. పార్టీ ఫిరాయింపునకు సంబంధించి వివరణ ఇవ్వడానికి మరికొంత గడువు కావాలని ఆయన సభాపతిని కోరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

వారిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి మినహా మిగిలిన ఎనిమిది మంది తమ సమాధానాలను అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు. ఈ నేపథ్యంలో, ఫిరాయింపు ఫిర్యాదులపై స్పందించాలని కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్‌కు సభాపతి ఇటీవల మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23వ తేదీలోగా అఫిడవిట్ రూపంలో సమాధానాలు సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ క్రమంలో కడియం శ్రీహరి సభాపతిని కలిసి వివరణ ఇవ్వడానికి కొంత సమయం కావాలని కోరారు. మరోవైపు, ఢిల్లీ పర్యటనలో ఉన్న మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ తిరిగి వచ్చిన వెంటనే సభాపతిని కలవనున్నారు. దానం నాగేందర్ కూడా మరికొంత సమయం కోరే అవకాశం ఉంది.
Kadiyam Srihari
Telangana Assembly
Speaker Prasad Kumar
Defection
Station Ghanpur

More Telugu News