Mulugu district: బంగారం పంపకాల్లో వివాదం.. పోలీస్ స్టేషన్ చేరిన గుప్త నిధుల వ్యవహారం

Hidden treasure sharing conflict in Mulugu leads to police investigation
  • ములుగు జిల్లాలో గుప్త నిధుల కలకలం
  • రాగి బిందెలో 36 బంగారు బిళ్లలు లభ్యం
  • ఒక్కో బిళ్ల బరువు 23 గ్రాములు
గుప్త నిధులు దొరికాయన్న ఆనందం వారికి ఎంతోసేపు నిలవలేదు. వాటిని పంచుకునే విషయంలో తలెత్తిన వివాదం చివరకు వారిని పోలీసుల ముందుకు నడిపించింది. ఈ ఆసక్తికర ఘటన తెలంగాణలోని ములుగు జిల్లాలో వెలుగు చూసింది. గుప్త నిధుల వ్యవహారానికి సంబంధించి ఐదుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

వివరాల్లోకి వెళితే.. సుమారు ఆరు నెలల క్రితం కొందరు వ్యక్తులు ఒక బృందంగా ఏర్పడి మహారాష్ట్రలోని సిరిపంచ సమీపంలో ఓ పాత ఇంట్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ క్రమంలో వారికి ఒక రాగి బిందె దొరికింది. దానిని తెరిచి చూడగా, అందులో భారీగా బంగారం ఉండటంతో వారి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

అయితే, ఆ బంగారాన్ని పంచుకునే విషయంలో వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. మాటామాటా పెరిగి ఘర్షణ వరకు దారితీయడంతో ఈ పంచాయితీ కాస్తా పోలీసులకు చేరింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో మరిన్ని వివరాలు వెల్లడయ్యాయి. తవ్వకాల్లో దొరికిన రాగి బిందెలో మొత్తం 36 బంగారు బిళ్లలు ఉన్నాయని, ఒక్కో బిళ్ల సుమారు 23 గ్రాముల బరువు ఉంటుందని నిందితులు తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నారు. 
Mulugu district
Telangana
Guptanidhulu
Hidden treasures
Gold biscuits
Siripanch
Maharashtra
Police investigation
Treasure sharing dispute

More Telugu News