Maoists: జియో వర్కర్ల ముసుగులో మావోయిస్టులు.. ఏలూరులో అద్దె ఇంటి గుట్టురట్టు!

Maoists Hiding as Jio Workers Busted in Eluru Rent House
  • జియో కేబుల్ వర్కర్లమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకున్న మావోలు
  • ఏలూరు గ్రీన్‌సిటీలో 15 మంది బృందం అరెస్ట్
  • నెలకు రూ.10 వేల అద్దెకు మకాం వేసిన వైనం
ఏలూరులో ఇటీవల పట్టుబడిన మావోయిస్టుల కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. తాము జియో కేబుల్ పనులు చేసేందుకు వచ్చామని చెప్పి, నగరంలోని గ్రీన్‌సిటీ ప్రాంతంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని మకాం వేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 15 మంది మావోయిస్టులు ఈ ఇంట్లోనే తలదాచుకున్నట్లు తేలింది.

వివరాల్లోకి వెళ్తే, గత నెల 26న ఈ బృందం నెలకు రూ.10 వేల చొప్పున అద్దె మాట్లాడుకుని ఇంట్లోకి దిగింది. ఆ నెలకు సంబంధించిన వారం రోజుల అద్దెను కూడా ఇంటి యజమానికి చెల్లించారు. వీరు బయట ఎవరితోనూ ఎక్కువగా కలిసేవారు కాదని, ఇంట్లో ఉన్న వారిలో ఇద్దరు మాత్రమే బయటకు వచ్చి ఆహారం, ఇతర సామగ్రి తీసుకెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు. వీరి కదలికలపై అనుమానం కలగకుండా జాగ్రత్త పడ్డారు.

ఈ ఇంటి యజమాని నగరంలోని ఓ ప్రముఖ కార్పొరేట్ కళాశాలకు సీఈవోగా పనిచేస్తున్నట్లు తెలిసింది. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మావోయిస్టులు ఇల్లు అద్దెకు తీసుకోవడానికి ఎవరు మధ్యవర్తిత్వం వహించారు? వారికి స్థానికంగా ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నెట్‌వర్క్‌కు సంబంధించిన పూర్తి వివరాలు రాబట్టే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
Maoists
Eluru
Jio workers
Andhra Pradesh
Naxalites
Green City
Rent house
Police investigation
Corporate college CEO
Maoist network

More Telugu News