Jagan Mohan Reddy: ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు వస్తున్న జగన్.. కాసేపట్లో సీబీఐ కోర్టుకు వైసీపీ అధినేత

Illegal Assets Case Jagan Appears Before CBI Court in Hyderabad
  • అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవుతున్న జగన్
  • కోర్టు ఆదేశాలతో దాదాపు ఐదేళ్ల తర్వాత విచారణకు హాజరవుతున్న మాజీ సీఎం
  • నాంపల్లి కోర్టు వద్ద భారీగా పోలీసుల బందోబస్తు
ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ఈరోజు హైదరాబాద్ లోని నాంపల్లిలో ఉన్న సీబీఐ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. కాసేపటి క్రితమే ఆయన తాడేపల్లి నివాసం నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. బేగంపేట నుంచి ఆయన నేరుగా కోర్టుకు వెళతారు. అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా కోర్టు ఆదేశాల మేరకు ఆయన విచారణకు వచ్చారు. 

దాదాపు ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జగన్ ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావడం గమనార్హం. జగన్ చివరిసారిగా 2020 జనవరి 10న ఈ కేసులో వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసుకు సంబంధించి సీబీఐ మొత్తం 11 చార్జిషీట్లు దాఖలు చేసింది. జగన్ రాక నేపథ్యంలో పోలీసులు నాంపల్లి కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
Jagan Mohan Reddy
YS Jagan
CBI Court
Illegal Assets Case
Nampally Court
Hyderabad
Andhra Pradesh Politics
CBI Investigation
Corruption Case

More Telugu News