Samantha Ruth Prabhu: సమంత పాత్ర చాలా తేలికైంది: రాజ్ నిడిమోరు

Raj Nidimoru Comments on Samantha Nimrat Kaur Performances in Family Man
  • నవంబర్ 21 నుంచి 'ఫ్యామిలీ మ్యాన్ 3' స్ట్రీమింగ్
  • నటీమణుల నటనపై దర్శకుడు రాజ్ నిడిమోరు వ్యాఖ్యలు
  • సమంత, నిమ్రత్ కౌర్ పాత్రలు తేలికైనవేనని కామెంట్
దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’. రాజ్-డీకే దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై యాక్షన్ డ్రామా మూడో సీజన్ విడుదలకు సిద్ధమైంది. నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ల జోరు పెంచారు. ఇందులో భాగంగా దర్శకుడు రాజ్ నిడిమోరు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి.

ఈ సిరీస్‌లో సమంత, నిమ్రత్ కౌర్‌ల నటన గురించి ఆయన మాట్లాడుతూ, "ఈ సిరీస్ కోసం మేము రాసిన పాత్రలు మొదట ఎవరినీ ఉద్దేశించి రాసినవి కావు. సమంత అయినా, నిమ్రత్ కౌర్ అయినా తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. నిజానికి వారి పాత్రలు చేయడం చాలా తేలిక. అయినప్పటికీ వాళ్లు ఎంతో కష్టపడి ఆ పాత్రల్లో జీవించారు" అని పేర్కొన్నారు.

అదే సమయంలో, నటీనటుల విషయంలో తాను లింగ భేదాలు చూడనని స్పష్టం చేశారు. "పాత్రలో నటించేది పురుషుడా? మహిళా? అని నేను పట్టించుకోను. నా దృష్టిలో ఇద్దరూ సమానమే. స్క్రిప్ట్ ఏం డిమాండ్ చేస్తుందో దానినే నేను అనుసరిస్తాను" అని వివరించారు. అయితే, ఎంతో క్లిష్టమైన పాత్రలకు ప్రాణం పోసిన నటీమణుల గురించి మాట్లాడుతూ 'పాత్రలు తేలికైనవి' అని ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు, అక్కినేని నాగచైతన్యకు విడాకులు ఇచ్చిన తర్వాత... రాజ్ నిడిమోరుతో రిలేషన్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.
Samantha Ruth Prabhu
The Family Man 3
Raj Nidimoru
DK
Nimrat Kaur
Amazon Prime Video
web series
Indian Spy series
Samantha relationship rumours
Divorce

More Telugu News