Kavitha: కవిత ప్రశ్నకు సమాధానం చెప్పాలి: మంత్రి తుమ్మల వ్యాఖ్య

Kavitha Must Answer Questions Says Minister Thummala Nageswara Rao
  • తుమ్మల వంటి నాయకుడిని వదులుకోవడం కేసీఆర్ చేసిన తప్పు అన్న కవిత
  • ఈ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలన్న తుమ్మల నాగేశ్వరరావు
  • బీఆర్ఎస్ పెద్దలు తమ ఇంట్లో కుంపటిని రాష్ట్రమంతా పెట్టవద్దని వ్యాఖ్య
మీ ఇంటి ఆడబిడ్డ కవిత అడిగే ప్రశ్నలకు ముందుగా బీఆర్ఎస్ నాయకులు సమాధానం చెప్పాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీఆర్ఎస్ పెద్దలు తమ ఇంట్లో కుంపటిని రాష్ట్రమంతటా పెట్టవద్దని ఆయన వ్యాఖ్యానించారు.

జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా నిన్న ఖమ్మం జిల్లాలో పర్యటించిన కవిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుమ్మల నాగేశ్వరరావు వంటి సీనియర్ నాయకులను వదులుకోవడం కేసీఆర్ చేసిన తప్పని ఆమె అన్నారు. ఆ ప్రభావం వల్లే బీఆర్ఎస్ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. ఆమె వ్యాఖ్యల నేపథ్యంలో తుమ్మల ఈరోజు పైవిధంగా స్పందించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. ప్రత్తి కొనుగోలు చేయాలని ఒకవైపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెబుతున్నారని, మరోవైపు సీసీఐ నిబంధనలతో రైతులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎంఎస్‌పీకి పంటలు కొనే రాష్ట్రం తెలంగాణ అని ఆయన అన్నారు. 20 శాతం వరకు తేమ ఉన్నా పత్తి కొనాలని సీసీఐకి చెప్పినట్లు తెలిపారు. ఎకరాకు 7 క్వింటాళ్ల పత్తి నిబంధన ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
Kavitha
Thummala Nageswara Rao
BRS
Telangana Politics
KCR
Cotton Procurement

More Telugu News