Veeraiah: సౌదీ అరేబియాలో కరీంనగర్ జిల్లా వాసి గుండెపోటుతో మృతి

Veeraiah of Karimnagar District Dies of Heart Attack in Saudi Arabia
  • గన్నేరువరం మండలం హనుమాజిపల్లెకు చెందిన వీరయ్య మృతి
  • సౌదీలో ఒక కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరయ్య
  • పార్క్ చేసిన కారులో సేద తీరుతున్న సమయంలో గుండెపోటు
సౌదీ అరేబియాలో కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు. గన్నేరువరం మండలం, హనుమాజిపల్లెకు చెందిన వీరయ్య ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ ఒక కంపెనీలో కొన్నాళ్లుగా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ రోజు కారును పార్క్ చేసి అందులోనే సేద తీరుతుండగా గుండెపోటు రావడంతో మరణించాడు.

స్థానికులు, కంపెనీలోని ఇతర కార్మికులు వైద్యులకు సమాచారం అందించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు నిర్ధారించారు. తోటి కార్మికులు వెంటనే కుటుంబ సభ్యులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Veeraiah
Karimnagar district
Saudi Arabia
heart attack
Ganneruvaram
Hanumajipalle

More Telugu News