పార్టీ కార్యకర్తలకు బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు హెచ్చరిక
- ఇష్టారీతిన కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తామన్న రామచందర్ రావు
- బీజేపీపై ఎవరు పోస్టులు పెట్టినా కౌంటర్ ఇవ్వాలని సూచన
- బీజేపీపై తప్పుడు పోస్టులు పెడితే కేసులు పెడతామని హెచ్చరిక
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నకిలీ ఖాతాలతో బీజేపీ మీద పోస్టులు పెడుతున్నాయని ఆయన అన్నారు. తమపై తప్పుడు వార్త రాసిన పత్రికపై రూ. 5 కోట్ల పరువు నష్టం దావా వేశామని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తల మీద ఇష్టారీతిన పోస్టులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. బీజేపీపై తప్పుడు పోస్టులు పెడితే కేసులు పెడతామని హెచ్చరించారు. బీజేపీ చిల్లర రాజకీయాలకు భయపడదని ఆయన అన్నారు.