బీహార్ ఎన్డీయే శాసనసభాపక్ష నేతగా నితీశ్ కుమార్ ఖరారు
- నితీశ్‌ను కూటమి నేతగా ఎన్నుకున్న ఎమ్మెల్యేలు
- పాట్నాలోని గాంధీ మైదానంలో రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న నితీశ్
- బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 200కు పైగా స్థానాలు గెలిచిన ఎన్డీయే కూటమి
ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 200కు పైగా స్థానాల్లో విజయం సాధించింది. ఎన్డీయే కూటమిలో భాగమైన బీజేపీ 89 స్థానాల్లో, జేడీయూ 85 స్థానాల్లో, ఎల్జేపీ (పాశ్వాన్) 19 స్థానాల్లో గెలుపొందాయి. ప్రతిపక్ష మహాఘట్‌బంధన్ ఈ ఎన్నికల్లో పరాజయం పాలైంది. జేడీయూ 25 స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్ష హోదాను నిలబెట్టుకుంది.