Terrorist: జైలులో ఉగ్రవాదిని చితకబాదిన ఖైదీలు

Terrorist Ahmed Mohiuddin Beaten by Inmates in Sabarmati Jail
  • గుజరాత్ లోని సబర్మతి జైలులో ఘటన
  • హైదరాబాద్ కు చెందిన ఉగ్రవాది అహ్మద్ కు గాయాలు
  • ప్రసాదంలో విషం కలిపి అమాయకులను చంపాలని చూసిన అహ్మద్
ఆముదం గింజల నుంచి అత్యంత ప్రమాదకర విషం (రైసిన్) తయారు చేసి అమాయకుల ప్రాణాలు తీయాలని చూసిన ఉగ్రవాది అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్‌ పై జైలులో దాడి జరిగింది. అహ్మద్ ను యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం విదితమే.

ప్రస్తుతం అతడు గుజరాత్ లోని సబర్మతి జైలులో హైసెక్యూరిటీ బ్యారక్ లో ఉన్నాడు. అయితే, ఏం జరిగిందనే విషయంపై పూర్తి సమాచారం లేనప్పటికీ అహ్మద్ పై తోటి ఖైదీలు దాడి చేసి తీవ్రంగా కొట్టారని తెలుస్తోంది. ఈ ఘటనపై దర్యప్తు జరుపుతున్నామని, ఖైదీలు ఎందుకు దాడి చేశారనే విషయంపై ఆరా తీస్తున్నట్లు జైలు అధికారులు తెలిపారు.

ఖైదీలు మూకుమ్మడిగా దాడి చేయడంతో అహ్మద్‌ ప్రాణాలు కాపాడేందుకు పోలీసులు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం. దాడి గురించిన సమాచారం అందిన వెంటనే గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ బృందం సబర్మతి జైలుకు చేరుకుంది. దాడి ఎలా, ఎందుకు జరిగిందనే అంశంపై దర్యాప్తు ప్రారంభించింది.
Terrorist
jail
attack
Ahmed Mohiuddin Sayyed
Ahmed Mohiuddin
Sabarmati Jail
Gujarat ATS
Ricyn Poison
Terrorist Attack
Prison Attack
Gujarat Anti-Terrorism Squad

More Telugu News