Indigo Airlines: ఇండిగోకు డీజీసీఏ షాక్.. భారీ జరిమానా విధింపు

Indigo Airlines Fined Rs 20 Lakhs by DGCA
  • ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు రూ. 20 లక్షల జరిమానా
  • నిబంధనలు ఉల్లంఘించినందుకు డీజీసీఏ చర్యలు
  • ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో సొంత ప్రొసీజర్ అమలు
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగోకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) భారీ జరిమానా విధించింది. ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో ఇన్‌స్ట్రుమెంట్ ఫ్లైట్ ప్రొసీజర్‌కు సంబంధించి నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను, రూ. 20 లక్షల ఫైన్ కట్టాలని ఆదేశించింది. ఈ విషయాన్ని ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, స్టాక్ ఎక్స్ఛేంజ్ బీఎస్ఈకి అధికారికంగా తెలియజేసింది.

విమానయాన నిబంధనల ప్రకారం, ఎయిర్‌పోర్టులలో 'స్టాండర్ట్ ఇన్‌స్ట్రుమెంట్ డిపార్చర్', 'ఇన్‌స్ట్రుమెంట్ ఫ్లైట్ ప్రొసీజర్' లను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) మాత్రమే రూపొందించి, అమలు చేయాల్సి ఉంటుంది. అయితే, ఉదయ్‌పూర్ విమానాశ్రయంలో ఇండిగో సంస్థ సొంతంగా ఒక విధానాన్ని రూపొందించుకుని అమలు చేసినట్టు డీజీసీఏ తన తనిఖీల్లో గుర్తించింది.

ఇది నిబంధనలకు పూర్తిగా విరుద్ధమని పేర్కొంటూ డీజీసీఏ ఈ జరిమానా విధించినట్లు ఇండిగో వివరణ ఇచ్చింది. అయితే, ఈ జరిమానా వల్ల తమ సంస్థ ఆర్థిక, సాధారణ లేదా ఇతర కార్యకలాపాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.
Indigo Airlines
DGCA
Directorate General of Civil Aviation
Udaipur Airport
Instrument Flight Procedure
Aviation Regulations
Airports Authority of India
Fine
Interglobe Aviation
BSE

More Telugu News