Rahul Sipligunj: సీఎం రేవంత్ రెడ్డికి పెళ్లికార్డు అందించిన రాహుల్ సిప్లిగంజ్

Rahul Sipligunj Invites CM Revanth Reddy to Wedding
  • సీఎం రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్
  • కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి సీఎంను కలిసిన రాహుల్ సిప్లిగంజ్
  • హరిణ్య రెడ్డి టీడీపీ నేత, నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె
  • ఈ నెల 27వ తేదీన రాహుల్, హరిణ్యల వివాహ వేడుక
ప్రముఖ గాయకుడు, ఆస్కార్ విజేత రాహుల్ సిప్లిగంజ్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నారు. ఈ క్రమంలో తన వివాహానికి హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన స్వయంగా ఆహ్వానించారు. కాబోయే భార్య హరిణ్య రెడ్డితో కలిసి నిన్న సీఎంను కలిసిన రాహుల్, తమ పెళ్లి శుభలేఖను అందజేశారు.

ఈ నెల 27వ తేదీన రాహుల్, హరిణ్యల వివాహం జరగనుంది. వీరిద్దరి నిశ్చితార్థం గత ఆగస్టు నెలలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన విషయం తెలిసిందే. కాగా, రాహుల్ సిప్లిగంజ్ చేసుకోబోయే హరిణ్య రెడ్డి.. టీడీపీ నేత, నుడా ఛైర్మన్‌ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కుమార్తె.

గతంలో 'గద్దర్' అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్‌ను ఉద్దేశించి "ఓల్డ్‌ సిటీ నుంచి ఆస్కార్‌ వరకూ వెళ్లిన కుర్రాడు" అంటూ ప్రత్యేకంగా అభినందించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటతో కాలభైరవతో కలిసి ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్న రాహుల్.. అనేక సినిమా పాటలు, ప్రైవేట్ ఆల్బమ్స్‌తో యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ‘రంగమార్తాండ’ చిత్రంతో నటుడిగానూ ఆయన గుర్తింపు పొందారు. 
Rahul Sipligunj
Revanth Reddy
Harinya Reddy
Telangana CM
Wedding Invitation
RRR Movie
Naatu Naatu Song
Oscar Winner
Kotamreddy Srinivasulu Reddy
Gaddar Awards

More Telugu News