Sundar Pichai: 'ఏఐ'పై సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు

Sundar Pichai Key Comments on AI Bubble
  • ప్రతి కంపెనీపై ఆ ప్రభావం ఉంటుందన్న సుందర్ పిచాయ్
  • ఏఐలో పెట్టుబడులు పెరగడంలో హేతుబద్ధత లేదన్న సుందర్ పిచాయ్
  • వాస్తవానికి ఏ కంపెనీ కూడా ఏఐ ప్రభావాన్ని తట్టుకోలేదని వ్యాఖ్య
కృత్రిమ మేథ (ఏఐ) అంశంపై గూగుల్ మాతృసంస్థ అల్పాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ బుడగ పగిలితే ప్రతి కంపెనీపై ఆ ప్రభావం ఉంటుందని హెచ్చరించారు. ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌పై పెట్టుబ‌డులు పెరుగుతున్నాయ‌ని, ఇదో అసాధార‌ణ సంద‌ర్భ‌మ‌ని, ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న 'ఏఐ' బూమ్‌లో హేతుబ‌ద్ద‌త లేదని అన్నారు.

ఒక‌వేళ ఏఐ విస్పోట‌నం చెందితే దాని ప్ర‌భావం అంతటా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ విస్పోటనాన్ని ఎదుర్కొనే స్థితిలో గూగుల్ సంస్థ ఉందా? అని అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ, ఆ తుఫాన్‌ను త‌మ కంపెనీ త‌ట్టుకుటుంద‌ని, కానీ ఏదైనా సాధ్య‌మే అని ఆయ‌న అన్నారు. వాస్తవానికి ఏ కంపెనీ కూడా ఏఐ ప్రభావానికి లోనుకాకుండా ఉండలేదని అన్నారు.

ఆ జాబితాలో తమ సంస్థ కూడా ఉందని సుందర్ పిచాయ్ అన్నారు. చాట్‌జీపీటీ, ఓపెన్ఏఐతో పోటీ ఉన్న నేప‌థ్యంలో ఆల్ఫాబెట్‌కు పెట్టుబ‌డులు రెట్టింపు అయినట్లు చెప్పారు. ఏఐకి చెందిన సూప‌ర్ చిప్స్‌ను ఆల్ఫా సంస్థ డెవ‌ల‌ప్ చేస్తోందని తెలిపారు. ఏఐ చెప్పే ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకూడదని అన్నారు.
Sundar Pichai
Artificial Intelligence
AI bubble
Google
Alphabet
ChatGPT
OpenAI
AI Super Chips
AI investments

More Telugu News