Nara Lokesh: ప్రత్యేక పూజా కార్యక్రమంలో నారా వారి ఫ్యామిలీ... ఫొటోలు ఇవిగో!

Nara Lokesh Family Performs Special Pooja
  • పవిత్ర కార్తిక మాసంలో సీఎం చంద్రబాబు కుటుంబం ప్రత్యేక పూజలు
  • కార్తిక చివరి సోమవారం నాడు రుద్రాభిషేకం నిర్వహణ
  • కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు, భువనేశ్వరి, లోకేశ్, బ్రహ్మణి, దేవాన్ష్
  • రాష్ట్ర శ్రేయస్సు, ప్రజల సంతోషం కోసం ప్రార్థించానని లోకేశ్ వెల్లడి
రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అత్యంత పవిత్రమైన కార్తిక మాసం చివరి సోమవారం సందర్భంగా సోమవారం నాడు ఈ పూజా కార్యక్రమాలు జరిగాయి.  ఈ పూజలో లోకేశ్ తో పాటు సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా బ్రహ్మణి, దేవాన్ష్ పాలుపంచుకున్నారు.

కుటుంబ సభ్యులందరూ కలిసి భక్తిశ్రద్ధలతో ఈ పూజలో పాల్గొనడం ఎంతో సంతోషాన్నిచ్చిందని, ఇది ఒక మధురమైన జ్ఞాపకమని లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా తాము రుద్రాభిషేకం సహా పలు ప్రత్యేక పూజలు చేసినట్లు నారా బ్రహ్మణి సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఆ పరమశివుని కరుణాకటాక్షాలు తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు పేర్కొన్నారు. కుటుంబ శ్రేయస్సుతో పాటు, రాష్ట్ర అభివృద్ధి, ప్రజలందరి జీవితాల్లో శాంతి, సంతోషాలు వెల్లివిరియాలని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు వివరించారు.
Nara Lokesh
Nara Chandrababu Naidu
Nara Bhuvaneshwari
Nara Brahmani
Devansh Nara
Karthika Masam
Rudrabhishekam
Andhra Pradesh
Family Pooja
Telugu News

More Telugu News