Azharuddin: సౌదీ బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం... సౌదీకి అజారుద్దీన్ బృందం

Saudi Bus Accident Telangana Govt Announces 5 Lakh Compensation
  • మక్కా నుంచి మదీనాకు ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదంలో 45 మంది మృతి
  • మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మంత్రివర్గం
  • అంత్యక్రియల కోసం ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరిని సౌదీకి పంపించాలని నిర్ణయం
సౌదీ అరేబియాలో జరిగిన బస్సు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం అందజేయాలని నిర్ణయించింది. ఈ మేరకు మంత్రివర్గం తీర్మానించింది. మక్కా నుంచి మదీనాకు యాత్రికులను తీసుకువెళుతున్న బస్సుకు ప్రమాదం జరిగిన దుర్ఘటనలో 45 మంది మృతి చెందిన విషయం విదితమే. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ఈ ఘటనపై తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది.

ప్రభుత్వ ప్రతినిధి బృందంగా మంత్రి అజారుద్దీన్, మజ్లిస్ ఎమ్మెల్యే, మరియు మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారి వెంటనే సౌదీ అరేబియాకు వెళ్లాలని మంత్రివర్గ సమావేశం నిర్ణయించింది.

మరణించిన వారి కుటుంబ సభ్యుల అభీష్టం మేరకు మృతదేహాలను అక్కడే మత సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించడానికి, ఒక్కో బాధిత కుటుంబం నుంచి ఇద్దరు కుటుంబ సభ్యులను సౌదీ అరేబియాకు తీసుకువెళ్లడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Azharuddin
Saudi Arabia bus accident
Telangana government
Revanth Reddy

More Telugu News