Supreme Court: ఢిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court Key Remarks on Delhi Pollution
  • తాత్కాలిక పరిష్కారాలతో కాలుష్యాన్ని అరికట్టలేమన్న సుప్రీంకోర్టు
  • రాజధానిలో నిర్మాణాలపై నిషేధం విధించేందుకు నిరాకరణ
  • పర్యావరణ ఆందోళనలు, అభివృద్ధి మధ్య సమతుల్యం ఉండాలని సూచన
ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో వాయు నాణ్యత సూచీ తరచూ 300 నుంచి 400 దాటుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. తాత్కాలిక పరిష్కారాలతో కాలుష్యాన్ని అరికట్టలేమని పేర్కొంది. కాలుష్యం నేపథ్యంలో రాజధానిలో నిర్మాణాలపై నిషేధం విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. పర్యావరణ ఆందోళనలు, అభివృద్ధి మధ్య సమతుల్యం ఉండాలని స్పష్టం చేసింది.

ఢిల్లీలో వేగంగా పెరుగుతున్న కాలుష్య సమస్యను అరికట్టేందుకు నిర్మాణాలపై నిషేధం విధించడం వంటి సంచలన ఆదేశాలు ఇచ్చేందుకు సుముఖంగా లేమని ఈ సందర్భంగా కోర్టు స్పష్టం చేసింది. ఈ కాలుష్య సంక్షోభాన్ని పరిష్కరించే లక్ష్యంగా నవంబర్ 19లోగా ఒక ప్రణాళికతో రావాలని కేంద్రాన్ని ఆదేశించింది. తాత్కాలిక పరిష్కారాలతో ఎలాంటి ప్రయోజనం ఉండదని, దీర్ఘకాలిక పరిష్కారాలను రూపొందించాలని సూచించింది.
Supreme Court
Delhi pollution
Air Quality Index
NCR pollution
Environmental concerns

More Telugu News