Hyderabad Building Collapse: గోషామహల్‌లో స్వల్పంగా కుంగిన ఐదంతస్తుల భవనం

Hyderabad Building Collapse Five Story Building Subsides in Goshamahal
  • భవనం పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో పిల్లర్ల కోసం గుంతలు
  • నిన్న రాత్రి జేసీబీతో గుంతలు తీసినట్లు తెలిపిన స్థానికులు
  • పక్కనే ఉన్న భవనానికి నెర్రలు వచ్చి స్వల్పంగా కుంగినట్లు వెల్లడి
హైదరాబాద్‌లో ఐదంతస్తుల భవనం స్వల్పంగా కుంగిపోయింది. గోషామహల్ ప్రాంతంలోని చాక్నవాడలో పక్కనే మరో భవనం నిర్మాణం కోసం తవ్వకాలు జరపడంతో ఈ భవనానికి నెర్రలు వచ్చి కుంగిపోయింది. నూతన భవనం నిర్మించేందుకు తవ్వకాలు జరిపిన కారణంగా అక్కడ గుంతలు ఏర్పడటంతో పక్కనే ఉన్న భవనానికి పగుళ్లు వచ్చాయి.

సంఘటన స్థలానికి అధికారులు, పోలీసులు చేరుకున్న భవనంలో ఉన్నవారిని ఖాళీ చేయించారు. ముందు జాగ్రత్తగా భవనం చుట్టుపక్కల ఉన్నవారిని కూడా అక్కడి నుంచి తరలించారు.

ఈ భవనం పక్కనే పిల్లర్ల కోసం జేసీబీతో గుంతలు తవ్వడంతో భవనంకు నెర్రలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని లేదంటే ఈ భవనం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ భవనం పూర్తిగా కూలిపోతే పక్కన ఉన్న భవనాలపై కూడా ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ భవనం పక్కనున్న ఖాళీ స్థలంలో రాత్రి సమయంలో జేసీబీతో తవ్వకాలు జరిపారని స్థానికులు తెలిపారు. దీంతో ఉదయం పది గంటలకు భవనం కొద్దిగా కుంగిపోయిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ఈ భవనం కుప్పకూలిపోయే ప్రమాదం ఉందని అన్నారు.
Hyderabad Building Collapse
Goshamahal
Building Collapse
Hyderabad
Chaknavada

More Telugu News