Hamood Ahmad Siddiqui: ప్రైవేటు బ్యాంకు స్థాపించి మోసం.. హైదరాబాద్‌లో ఆల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ సోదరుడి అరెస్టు

Hamood Ahmad Siddiqui Arrested in Hyderabad for Bank Fraud
  • మధ్యప్రదేశ్‌లోని మహూ ప్రాంతంలో ఆర్థిక మోసం కేసులో అరెస్టు
  • 25 ఏళ్ల క్రితం ప్రైవేటు బ్యాంకును స్థాపించి డిపాజిటర్లను మోసం చేసిన హమూద్ 
  • నాటి నుంచి అతని కోసం గాలిస్తున్న పోలీసులు
ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారు పేలుడు కేసులో విచారణ ఎదుర్కొంటున్న అల్ ఫలాహ్ విశ్వవిద్యాలయం ఛైర్మన్ జావెద్ సిద్ధిఖీ సోదరుడు హమూద్ అహ్మద్ సిద్ధిఖీని మధ్యప్రదేశ్ పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. 25 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్‌లోని మహూ ప్రాంతంలో జరిగిన ఆర్థిక మోసం కేసులో అతడిని అరెస్టు చేశారు.

మహు ప్రాంతంలో 25 ఏళ్ల క్రితం అతను ఒక ప్రైవేటు బ్యాంకును స్థాపించి డిపాజిటర్లను మోసం చేశాడు. ఈ బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేస్తే రెట్టింపు చేస్తామని చెప్పడంతో వందలాది మంది ప్రజలు డబ్బులు డిపాజిట్ చేశారు. ఈ కుంభకోణం బయటపడటంతో 2000వ సంవత్సరంలో కుటుంబంతో సహా మహూ నుంచి పరారయ్యాడు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

హమూద్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేశామని మహూ సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్ లలిత్ సింగ్ సికర్వార్ తెలిపారు. అతడు లో-ప్రొఫైల్‌లో జీవిస్తూ షేర్ ట్రేడింగ్ చేస్తున్నట్లు గుర్తించారు. ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జావెద్ సిద్ధిఖీ పూర్వాపరాలను పోలీసులు పరిశీలిస్తున్న సమయంలో అతని సోదరుడు హమూద్‌పై చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసు బయటకు వచ్చింది.
Hamood Ahmad Siddiqui
Al Falah University
Javed Siddiqui
Hyderabad Arrest

More Telugu News