SS Rajamouli: మీరు కూడా మీ హీరోలాగే క్రమశిక్షణ కలిగినవాళ్లు: రాజమౌళి

SS Rajamouli Praises Mahesh Babu Fans Discipline
  • వారణాసి ఈవెంట్ విజయవంతంపై రాజమౌళి, మహేశ్ బాబు హర్షం
  • ఈవెంట్‌లో కొన్ని సమస్యలు తలెత్తినా ఫ్యాన్స్ ఓపికగా ఉన్నారన్న రాజమౌళి
  • మహేశ్ అభిమానులు తమ హీరోలాగే క్రమశిక్షణతో ఉన్నారని ప్రశంస
  • సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులకు, మీడియాకు జక్కన్న ధన్యవాదాలు
  • అభిమానులు చూపిన ప్రేమకు, ఆప్యాయతకు మహేశ్ బాబు కృతజ్ఞతలు
  • త్వరలోనే మళ్లీ కలుస్తానని అభిమానులకు మాటిచ్చిన మహేశ్
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్‌స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రం 'వారణాసి' కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి నిన్న హైదరాబాదులో జరిగిన 'గ్లోబ్‌ట్రాటర్' ఈవెంట్‌కు అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమం అనంతరం రాజమౌళి, మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈవెంట్ గురించి రాజమౌళి స్పందిస్తూ మహేశ్ బాబు అభిమానులపై ప్రశంసల వర్షం కురిపించారు. "వారణాసి ఈవెంట్ కోసం సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించి వచ్చిన మహేశ్ అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. దాదాపు 3 కిలోమీటర్లు చలిలో నడిచి వచ్చారు. మా వైపు నుంచి కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తినా, మీ సహనం ఎక్కడా తగ్గలేదు. ఒక్క విషయం చెప్పాలి... మీరు కూడా మీ అభిమాన హీరోలాగే ఎంతో క్రమశిక్షణతో ఉన్నారు. మద్దతుగా నిలిచిన ప్రతి తెలుగు సినిమా ప్రేక్షకుడికి నా కృతజ్ఞతలు" అని రాజమౌళి తన పోస్టులో పేర్కొన్నారు.

అనంతరం మహేశ్ బాబు కూడా ఈవెంట్‌పై స్పందించారు. "అభిమానులు చూపించిన ప్రేమ, ఎనర్జీని స్వీకరిస్తున్నాను. మా 'వారణాసి' సినిమాను ప్రపంచానికి అందిస్తున్నాం. దూరం నుంచి వచ్చి మా బృందంపై ఇంత ఆప్యాయత చూపిన నా అభిమానులకు, మీడియాకు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. త్వరలోనే మళ్లీ మీ అందరినీ కలుస్తాను" అని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.
SS Rajamouli
Mahesh Babu
Varanasi Movie
Rajamouli Mahesh Babu Movie
Telugu Cinema
Globetrotter Event
Hyderabad Event
Telugu Movie Fans
Tollywood News
Varanasi

More Telugu News