Nitish Kumar: బీహార్ లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేదెప్పుడంటే..!

Nitish Kumar likely to be Bihar CM again
  • పాట్నాలోని గాంధీ మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారం
  • మరోమారు ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్..!
  • సీఎం ఎవరనేదానిపై అధికారికంగా ఇప్పటికీ వెలువడని ప్రకటన
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ నెల 14న ఫలితాలు వెలువడగా, ప్రస్తుతం నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 19న లేదా 20వ తేదీన బీహార్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇందుకు పాట్నాలోని గాంధీ మైదానం వేదిక కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారని సమాచారం. మరోమారు నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తారని ఎన్డీయే కూటమి వర్గాలు పేర్కొన్నాయి. అయితే, నూతన సీఎం ఎవరనే దానిపై ఇప్పటి వరకూ అధికారికంగా ఎన్డీయే కూటమి నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
Nitish Kumar
Bihar
Bihar Government
Bihar Elections 2020
NDA Alliance
Patna
Gandhi Maidan
Narendra Modi
Chief Minister

More Telugu News