Nara Lokesh: ఈ జాకెట్ ఎక్కడ తయారైంది?... తన ప్రశ్నకు తానే సమాధానం చెప్పిన మంత్రి నారా లోకేశ్
- తన జాకెట్‌పై సోషల్ మీడియాలో క్విజ్ పెట్టిన లోకేశ్
- సరైన సమాధానం చెప్పినవారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ అని ప్రకటన
- అయితే, బహుమతి ఎవరికీ దక్కలేదన్న మంత్రి
- తన ప్రశ్నకు తానే సమాధానం చెప్పిన లోకేశ్
- తూర్పు గోదావరి జిల్లా పులగుర్తలో తయారైందని వెల్లడి
- ఏపీ చేనేత వస్త్రాలకు వినూత్నంగా ప్రచారం
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. తాను ధరించిన ఒక కొత్త జాకెట్‌కు సంబంధించి నెటిజన్లకు ఒక ప్రశ్న సంధించి, చివరికి ఆ ప్రశ్నకు తానే సమాధానం చెప్పి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ సంఘటన ద్వారా ఆయన ఏపీ చేనేత వస్త్రాలకు వినూత్నంగా ప్రచారం కల్పించారు.
వివరాల్లోకి వెళితే, విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు 2025లో పాల్గొన్న సందర్భంగా లోకేశ్ ఒక ప్రత్యేకమైన జాకెట్ ధరించారు. ఆ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ, "నా కొత్త జాకెట్ ఎలా ఉంది? ఇది దేనితో తయారు చేశారో ఊహించగలరా? సరైన సమాధానం చెప్పిన వారికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఉంటుంది" అంటూ #GuessAndWin హ్యాష్‌ట్యాగ్‌తో ఒక పోస్ట్ పెట్టారు. దీనిపై నెటిజన్ల నుంచి రకరకాల సమాధానాలు వచ్చాయి.
అయితే, ఆ తర్వాత కొద్దిసేపటికే లోకేశ్ మరో పోస్ట్ చేశారు. ఈసారి సర్‌ప్రైజ్ బహుమతి ఎవరికీ దక్కలేదని పేర్కొన్నారు. ఆ జాకెట్ మిలాన్ లేదా ముంబైలో తయారైంది కాదని, తూర్పు గోదావరి జిల్లా, అనపర్తి మండలం, పులగుర్త అనే ఒక చిన్న గ్రామంలో స్థానిక కళాకారులు చేతితో నేసినదని వెల్లడించారు. స్థానిక ఖాదీ, మల్ వస్త్రాల కలయికతో దీన్ని రూపొందించారని వివరించారు. ఈ పోస్ట్ ద్వారా #GoLocal, #AndhraHandlooms అంటూ స్థానిక ఉత్పత్తుల గొప్పతనాన్ని చాటిచెప్పారు.