Ravindra Jadeja: టెస్టుల్లో రవీంద్ర జడేజా అరుదైన ఘనత.. దిగ్గజాల క్లబ్‌లో చోటు
- టెస్ట్ క్రికెట్‌లో రవీంద్ర జడేజా అరుదైన ఘనత
- 4000 రన్స్, 300 వికెట్లు తీసిన నాలుగో క్రికెటర్‌గా రికార్డ్
- కపిల్ దేవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత ఆటగాడు
- ఇదే మ్యాచ్‌లో 4000 పరుగుల మైలురాయి దాటిన కేఎల్ రాహుల్
భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టెస్ట్ క్రికెట్‌లో ఓ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. 4000 పరుగులు, 300 వికెట్లు సాధించిన దిగ్గజాల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికాతో ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో ఈ ఘనతను సాధించాడు. తన ఇన్నింగ్స్‌లో 10వ పరుగు పూర్తి చేసిన జడేజా, టెస్టుల్లో 4000 పరుగుల మార్కును దాటాడు.
దీంతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో 4000 పరుగులు, 300కు పైగా వికెట్లు తీసిన నాలుగో ఆటగాడిగా జడేజా నిలిచాడు. ఇంతకు ముందు ఈ జాబితాలో దిగ్గజాలు ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, డానియల్ వెటోరి మాత్రమే ఉన్నారు. కేవలం 87 టెస్టుల్లోనే జడేజా ఈ ఘనత సాధించడం విశేషం. అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ఆటగాళ్ల జాబితాలో ఇయాన్ బోథమ్ (72 టెస్టులు) తర్వాత రెండో స్థానంలో నిలిచాడు. జడేజా తన టెస్ట్ కెరీర్‌లో ఇప్పటివరకు 6 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో పాటు 331 వికెట్లు పడగొట్టాడు.
రాహుల్ 4000 పరుగుల మైలురాయి
ఇదే మ్యాచ్‌లో మరో ఇద్దరు భారత ఆటగాళ్లు కూడా కీలక మైలురాళ్లు అందుకున్నారు. కేఎల్ రాహుల్ టెస్టుల్లో 4000 పరుగుల మార్కును దాటి, ఈ ఘనత సాధించిన 18వ భారత బ్యాటర్‌గా నిలిచాడు. మరోవైపు వికెట్ కీపర్ రిషభ్ పంత్ ఓ అద్భుతమైన రికార్డు సృష్టించాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు (91) బాదిన భారత ఆటగాడిగా వీరేంద్ర సెహ్వాగ్‌ను అధిగమించి అగ్రస్థానానికి చేరాడు.