Daggubati Purandeswari: ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించడం నా అదృష్టం: పురందేశ్వరి

Daggubati Purandeswari Receives Honors at Commonwealth Womens Conference
  • రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధికి త్వరలో టెండర్లు పిలుస్తామని ప్రకటన
  • మొంథా తుపాను నష్టంపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించానని వెల్లడి
  • గోదావరి పుష్కరాల నిర్వహణపై అధికారులతో సమావేశం 
ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించడం తన అదృష్టంగా భావిస్తున్నానని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఇటీవల కామన్వెల్త్ మహిళా సదస్సులో ఐదు రోజుల పాటు పాల్గొని తిరిగి వచ్చిన ఆమె ఈరోజు రాజమండ్రిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పురందేశ్వరి పలు జాతీయ, స్థానిక అంశాలపై స్పందించారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం ద్వారా ప్రజలు స్పష్టమైన సందేశం ఇచ్చారని వ్యాఖ్యానించారు.

స్థానిక అభివృద్ధి పనుల గురించి వివరిస్తూ, రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు త్వరలోనే టెండర్లు పిలుస్తామని పురందేశ్వరి హామీ ఇచ్చారు. తన కృషి ఫలితంగా కొవ్వూరులో రెండు రైళ్లు, అనపర్తిలో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సౌకర్యం కల్పించగలిగామని తెలిపారు. పొగాకు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, మొంథా తుపాను వల్ల కలిగిన నష్టంపై కూడా కేంద్రంతో చర్చించానని ఆమె పేర్కొన్నారు.

అనంతరం గోదావరి పుష్కరాల నిర్వహణపై అధికారులతో పురందేశ్వరి సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కర పనులకు సంబంధించిన అంచనాలను తక్షణమే రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శాఖాపరమైన విధానాలపై వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
Daggubati Purandeswari
Commonwealth Women's Conference
United Nations General Assembly
Rajamundry
Bihar Elections
NDA Coalition
Godavari Pushkaralu
Andhra Pradesh
BJP MP

More Telugu News