Ravindra Jadeja: ఐపీఎల్: సీఎస్కేను వీడిన జడేజా

Ravindra Jadeja Leaves CSK to Join Rajasthan Royals
  • రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడనున్న జడ్డూ
  • ఆర్ ఆర్ నుంచి సీఎస్కేకు సంజూ శాంసన్
  • మొత్తం ఎనిమిది మంది జట్లు మారినట్లు ఐపీఎల్ ప్రకటన
ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో సుదీర్ఘ కాలంగా ఆడుతున్న రవీంద్ర జడేజా తాజాగా ఆ జట్టు నుంచి బయటకు వచ్చాడు. ఇకపై జడ్డూ రాజస్థాన్ రాయల్స్ (ఆర్ ఆర్) కు ప్రాతినిథ్యం వహించనున్నాడు. అదేవిధంగా రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న సంజూ శాంసన్ ఆ జట్టును వీడి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో చేరాడు. ఈమేరకు ఐపీఎల్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. రవీంద్ర జడేజా, సంజూ శాంసన్ తో పాటు మొత్తం ఎనిమిది మంది ఆటగాళ్లు జట్లు మారారని పేర్కొంది.

సన్ రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్ హెచ్) నుంచి షమీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జీ) జట్టుకు మారాడని, కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టుకు ఆడుతున్న మయాంక్ మార్కండే ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టుకు మారాడని తెలిపింది. ముంబై ఇండియన్స్ (ఎంఐ) జట్టుకు ఆడుతున్న అర్జున్ టెండుల్కర్ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్ జీ) జట్టుకు, రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న నితీశ్‌ రానా ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) జట్టుకు, ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) ఆడుతున్న డొనోవాన్‌ రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కు, చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్టులో ఉన్న సామ్‌ కరన్‌ రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్టుకు మారారని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది.
Ravindra Jadeja
IPL
Chennai Super Kings
CSK
Rajasthan Royals
Sanju Samson
Team Transfers
Indian Premier League
Cricket
Player Trades

More Telugu News